Janasena Party | ఆ లెజెండరీ కమెడియన్ జనసేన పార్టీలో చేరబోతున్నాడా..?
Janasena Party | చాలామంది నటులు మాత్రం జనసేనకు ఓపెన్ గానే సపోర్ట్ చేస్తున్నారు. అందులో హైపర్ ఆది లాంటి వాళ్లు ఎప్పుడూ ముందే ఉంటారు. జనసేన పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్ జరిగినా కూడా హైపర్ ఆదితో పాటు మరికొందరు నటులు వేదిక మీదికి వచ్చి తమ అభిప్రాయాలను జనాలతో పంచుకుంటూ ఉంటారు.
Janasena Party | పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి బయటి నుంచి సపోర్ట్ ఎలా ఉందో తెలియదు కానీ.. ఇండస్ట్రీ నుంచి మాత్రం బాగానే సపోర్ట్ లభిస్తుంది. ఇప్పటికే కొంతమంది నటులు వైసీపీలో ఉన్నారు. మరికొందరు తెలుగు దేశంలో ఉన్నారు. అయితే చాలామంది నటులు మాత్రం జనసేనకు ఓపెన్ గానే సపోర్ట్ చేస్తున్నారు. అందులో హైపర్ ఆది లాంటి వాళ్లు ఎప్పుడూ ముందే ఉంటారు. జనసేన పార్టీకి సంబంధించిన ఏ మీటింగ్ జరిగినా కూడా హైపర్ ఆదితో పాటు మరికొందరు నటులు వేదిక మీదికి వచ్చి తమ అభిప్రాయాలను జనాలతో పంచుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఒక లెజెండరీ కమెడియన్ జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు బ్రహ్మానందం.
సాధారణంగానే ఈయనకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి ఉండదు. వాటికి వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు బ్రహ్మానందం. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం వచ్చి జనసేన పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకోవాలని ఆలోచిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేని బ్రహ్మానందం రాజకీయాల వైపు రావాలని చూస్తున్నాడు. నిజానికి ఈయన బీజేపీ పార్టీతో ఎప్పటినుంచో మంచి సంబంధాలే కలిగి ఉన్నాడు. కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారానికి కూడా రెండుసార్లు వెళ్లొచ్చాడు బ్రహ్మానందం. అయితే ఆ పార్టీతో ప్రత్యక్ష అనుబంధం మాత్రం ఎప్పుడూ లేదు. ఇప్పుడు మాత్రం జనసేనలో యాక్టివ్ మెంబర్ కావాలని చూస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

మొన్న జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్‌ను ఏకంగా దైవాంశ సంభూతుడు అంటూ పొగడ్తల వర్షం కురిపించాడు బ్రహ్మానందం. దాంతో పాటు అన్ని వదులుకొని జనాల కోసం వచ్చాడు అంటూ తెగ పొగిడేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత జనసేన పార్టీకి బ్రహ్మానందం బాగా దగ్గరవుతున్నాడు అనే విషయం అర్థమవుతుంది. ఒకవేళ ప్రత్యక్షంగా జనసేనలో చేరకపోయినా కూడా.. పరోక్షంగా అయినా ఆ పార్టీకి అన్ని విధాలుగా హెల్ప్ చేయాలని చూస్తున్నాడు బ్రహ్మానందం. ఎన్నికల సమయంలో కూడా ప్రచారానికి రావాలని ఆలోచిస్తున్నాడు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా తన మద్దతు తెలిపాడు బ్రహ్మానందం.
మెగా కుటుంబంతో ఎప్పుడు బ్రహ్మానందానికి ప్రత్యేకమైన అనుబంధమే ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మానందం సినిమాల్లోకి రావడానికి కారణం చిరంజీవి. అప్పట్లో ఆయనే దగ్గరుండి జంధ్యాల గారికి పరిచయం చేయడమే కాకుండా కెరీర్ మొదట్లో అవకాశాలు ఇప్పించాడు. అందుకే చిరంజీవి అన్నా.. మెగా ఫ్యామిలీ అన్నా ప్రత్యేక కృతజ్ఞతతో ఉంటాడు బ్రహ్మానందం.
Read More :
Baby Movie Collections | బేబీ సినిమాకు 100 కోట్లు వస్తాయా.. మేకర్స్ మాస్టర్ ప్లాన్..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

