పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒంటరి అవుతున్నాడా..?

Power star Pawan kalyan | ఏమో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ ( Republic ) ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు విన్న తర్వాత.. కచ్చితంగా మెగా కుటుంబం ( Mega family ) నుంచి ఎవరైనా బయటకు వచ్చి ఆయనకు బాహాటంగా సపోర్ట్ చేస్తారని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా సినిమా ఇండస్ట్రీ కోసమే.. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు అనేవాళ్లు కూడా లేకపోలేదు. ఆయన స్పీచ్ విన్న తర్వాత సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్‌కు తమ సపోర్ట్ తెలియజేశారు. కానీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఎలాంటి అండదండలు పవన్ కు రాలేదు. పైగా ఆయన మాట్లాడిన మాటలతో తమకు ఎలాంటి సంబంధం లేదు అంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అందులో నిర్మాతలు అందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అతడి వ్యక్తిగతమని.. వాటిని ఇండస్ట్రీతో ముడి పెట్టవద్దు అంటూ వారు ఆ ప్రెస్‌నోట్‌లో కోరారు.
ఫిలిం ఛాంబర్ మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి ( mega star Chiranjeevi ) సైతం తన తమ్ముడి మాట తీరును తప్పుపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఏపీ మంత్రి పేర్ని నాని మీడియా ముందు చెప్పాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు చిరంజీవి కూడా విచారం వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మాటలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్‌కు ఇంట్లో కూడా సపోర్ట్ లేదని అర్థమవుతుంది. మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అర డజను మంది స్టార్ హీరోలున్నారు. వాళ్లు బయటికి వచ్చి పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ తెలియజేస్తే చాలా బాగుంటుంది అని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే అది జరిగేలా కనిపించడం లేదు. మరోవైపు నిర్మాతలు, హీరోలు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. లవ్ స్టోరీ సక్సెస్ మీట్లో నాగార్జున పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాడు. మొత్తానికి ఎవరి సపోర్ట్ లేక పవన్ కళ్యాణ్ ఒంటరి అయిపోయాడు అనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Dil Raju | సినీ పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దు: దిల్ రాజు
ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
‘మా’ రాజకీయ వేదిక కాదు.. ప్రకాశ్ రాజ్‌పై నరేశ్ ఫైర్
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
బిగ్ బాస్ 5 తెలుగులో తొలిసారి అబ్బాయి ఎలిమినేట్ కాబోతున్నాడా..?
మోహన్ బాబును దొంగ నా కొడుకు అని తిట్టిన స్టార్ హీరో ఎవరు..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
తుంగతుర్తిలో ప్రమాదకరంగా డ్రైనేజ్ పైపులు
Irrigation water | గండి పూడ్చకుండానే వెళ్లిపోయిన ఇరిగేషన్ అధికారులు.. వృథాగా పోతున్న సాగునీరు
కోటమైసమ్మ ఆలయ తలనీలాల సేకరణ హక్కులకు బహిరంగ వేలం
PM Modi | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఖాతానే తెరువలేదుగా.. ప్రధాని మోదీ సెటైర్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

