విశాల్ (Vishal) హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం సామాన్యుడు (Saamanyudu) ..నాట్ ఏ కామన్ మ్యాన్..ట్యాగ్ లైన్. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని విశాల్ హోం బ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరి బ్యానర్లో నిర్మిస్తున్నాడు. డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీని ఫైనల్ చేసింది విశాల్ టీం. ఈ సంక్రాంతి రేసు నుంచి భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ లాంటిపెద్ద సినిమాలు తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో సామాన్యుడు చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దింపాడు విశాల్.
జనవరి 14న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని విశాల్ టీం ప్రకటించింది. తుపా శరవణన్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టుకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్. యోగిబాబు, బాబు రాజ్ జాకొబ్, పా తులసి, రవీనా రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కవిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.
మరోవైపు సుమంత్ అశ్విన్ హీరోగా ఎంఎస్ రాజు (MS Raju) తెరకెక్కిస్తోన్న చిత్రం 7 డేస్ 6 నైట్స్ (7 Days 6 Nights) జనవరి 14న విడుదల కానుంది. దీంతోపాటు దిల్ రాజు మేనల్లుడు అశిష్ (Ashish Reddy) రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం రౌడీ బాయ్స్ (Rowdy Boys)గ్రాండ్గా విడుదల కానుంది. కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న సూపర్ మచ్చి (Super machi) జనవరి 14న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానున్నాయి. మరి బాక్సాపీస్ వద్ద ఈ సినిమాల మధ్య పోరు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.