Vishal: విశాల్ బర్త్ డే.. 31వ సినిమా టైటిల్ ప్రకటించిన మేకర్స్

తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న యువ నటుడు.కెరీర్లో 30 సినిమాలలో నటించిన విశాల్ వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులని అలరించాడు. ప్రస్తుతం తన 31వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. “నాట్ ఏ కామన్ మ్యాన్” అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా టైటిల్‌ని నేడు విశాల్ బర్త్ డే సందర్భంగా రివీల్ చేశారు మేకర్స్.సామాన్యుడు అనే టైటిల్‌తో తెలుగులో ఈ మూవీ విడుదల కానుందని తెలియజేశారు.
పా శరవణన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈదు థెవైయో అధువే ధర్మం అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శరవణన్ విశాల్ 31వ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని విశాల్ ఫిలిం ఫ్యాక్టరి బేనర్‌పై విశాల్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర షూటింగ్ పలుమార్లు వాయిదా పడింది. ఓ సారి కరోనా వలన వాయిదా పడగా, మరోసారి విశాల్‌కి అయిన గాయం వలన ఆగింది. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్‌లో విశాల్ గాయపడ్డాడు. ఆ గాయం కారణంగా విశాల్ కు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఈ మూవీకి బ్రేక్ పడింది. చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చినట్టు తెలుస్తుంది.
విశాల్ చివరగా చక్ర అంటూ అందరినీ పలకరించారు. ఇక ఎనిమీ అంటూ ఆర్య, విశాల్‌లు రాబోతోన్నారు. ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వదిలిన టీజర్లు,పోస్టర్లు అదిరిపోయాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

