ఇస్లామాబాద్ : బాలీవుడ్ నటి సబా ఖమర్‌కు (Saba Qamar) కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. పాకిస్తాన్‌కు చెందిన స్థానిక కోర్టు ఒకటి ఆమె ఆరెస్ట్‌కు వారంట్ జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 6 వ తేదీకి వాయిదా వేసింది. రణ్‌దీప్ హుడాతో కలిసి నటించిన సినిమా ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ తో బాలీవుడ్‌కు వచ్చిన సబా ఖమర్.. అనంతరం హీరోయిన్, హిందీ మీడియం సినిమాల్లో నటించింది.
లాహోర్‌లోని చారిత్రక మసీదులో డ్యాన్స్ వీడియో షూటింగ్లో బిలాల్ సయీద్‌తో కలిసి సబా ఖమర్ పాల్గొన్నారు. దీనిపై గత ఏడాది ఆమెపై లాహోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ పీనల్ కోడ్ 295 ప్రకారం లాహోర్‌లోని పాత బస్తీలో ఉన్న మసీదు వజీర్ ఖాన్‌ను అపవిత్రం చేశారని కేసు దాఖలైంది. వీరిద్దరూ చారిత్రక మసీదులో డ్యాన్స్ వీడియోలో నటించి మసీదు పవిత్రతను దెబ్బతీశారని ఎఫ్ఐఆర్లో ఆరోపణలు చేశారు. సబా ఖమర్ చర్యతో లాహోర్‌లో ప్రజలు ఆందోళనలు చేపట్టారు. సభాను చంపేస్తామంటూ కూడా సోషల్ మీడియాలో పలు పోస్టులు వచ్చాయి. ఇదే ఘటనలో ఇద్దరు సీనియర్ అధికారులపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నది.
ఈ కేసుకు విచారణకు సబా ఖమర్ వరుసగా గైర్హాజరవుతున్నారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లాహోర్ మెజిస్ట్రేట్ కోర్టు సబా ఖమర్తోపాటు బిలాల్ సయీద్‌పై కూడా అరెస్ట్ వారంట్లు జారీ చేశారు. తదుపరి విచారణను వచ్చే నెల 6 కు వాయిదా వేశారు. ఇలాఉండగా, తనపై కేసు నమోదు కాగానే సబా ఖమర్ వివరణ ఇచ్చారు. ఆ రోజు మ్యూజిక్ వీడియో కోసం మ్యారేజి సీన్లో నటించామని తెలిపారు. అంతేగానీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏదీ మసీదులో వాడలేదని స్పష్టం చేశారు.
జపాన్ యువతలో బుస కొడుతున్న హికికొమోరి
పుటుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది..
జనవరి నుంచి కొత్తగా ఆన్లైన్ కార్డ్ చెల్లింపు వ్యవస్థ
యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా.. 252 పేజీల అమెరికా డాక్యుమెంట్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..