Online Payments : జనవరి నుంచి కొత్తగా ఆన్లైన్ కార్డ్ చెల్లింపు వ్యవస్థ
Online Payments : ఆన్లైన్ ద్వారా కార్డు చెల్లింపుల్లో అవకతవకలు, మోసాలను నివారించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలను ...

న్యూఢిల్లీ : ఆన్లైన్ ద్వారా కార్డు చెల్లింపుల్లో (Online Payments) అవకతవకలు, మోసాలను నివారించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలను బుధవారం నాడు ఆర్బీఐ జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి వస్తాయి. ఇకపై ఆన్లైన్ చెల్లింపుల కోసం టోకెన్ వ్యవస్థ అందుబాటులోకి రానున్నది. కార్డ్ ద్వారా జరిపే లావాదేవీలలో కార్డ్ జారీ చేసిన బ్యాంక్ లేదా కార్డ్ నెట్వర్క్ మినహా మరెక్కడా డాటాను నిల్వ చేయకూడదు.
ఏదైనా ఆహారంగానీ, క్యాబ్ గానీ బుక్ చేసే సమయంలో మనం మన కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఆయా సంస్థల వద్ద డాటాగా భద్రపరుస్తారు. ఈ డాటాతో మోసం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మోసాలను నివారించేందుకు ఆర్బీఐ ఈ టోకెన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నది. ఈ కొత్త విధానంలో కార్డ్ వివరాలు చెప్పాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా ప్రత్యేక ప్రత్యామ్నాయ సంఖ్యను ‘టోకెన్’ గా ఇవ్వనున్నారు. ఈ టోకెన్ మన కార్డ్‌తో లింక్ అయి ఉంటుంది. ఈ విధానంలో మన కార్డ్‌ను దుర్వినియోగపరిచి మోసం చేయడానికి అవకాశాలు ఉండవని ఆర్బీఐ పేర్కొన్నది. ఈ టోకెన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లలో కార్డ్‌పై ఉండే 16 అంకెల సంఖ్యను నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ 16 అంకెల సంఖ్యకు బదులుగా టోకెన్‌ను నమోదు చేస్తే సరిపోతుంది.
వివిధ ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా ఇప్పటికే మనం లావాదేవీలు జరిపి ఉన్నందున.. మన డెబిట్/ క్రెడిట్ కార్డ్ 16 అంకెల సంఖ్య, పేరు, సీవీవీ నంబర్ వంటి వివరాలు అన్నీ వారి వద్ద ఉన్నాయి. ఇకపై కొత్త టోకెన్ వ్యవస్థ రావడంతో వారి వద్ద ఉండే డాటా పనికిరాకుండా పోనున్నది. అయితే,
టోకెన్‌ను ప్రతీ ఒక్కరూ తీసుకోవాలనే నిబంధన ఏదీ లేదని, వినియోగదారుల కోరికపై ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. టోకెన్ తీసుకోవాలంటూ కస్టమర్లపై ఎలాంటి ఒత్తిడి ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. తమ డాటా భద్రంగా ఉండాలని కోరుకునే వారు ఖాతా ఉన్న బ్యాంకులను సంప్రదించి వచ్చే జనవరిలోగా టోకెన్లు పొందవచ్చు.
ఇవి కూడా చదవండి..
యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా.. 252 పేజీల అమెరికా డాక్యుమెంట్
జో బైడెన్‌కు తగ్గిన ప్రజాదరణ.. ఎందుకంటే..?
Star Trek : స్టార్ ట్రెక్ సిరీస్‌కు 55 ఏండ్లు
వైఫై పాస్వర్డ్ కావాలా? ఈ లెక్క ముడి విప్పండి..!
రక్తపోటు పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

