Joe Biden : జో బైడెన్‌కు తగ్గిన ప్రజాదరణ.. ఎందుకంటే..?
Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రజాదరణ తగ్గిపోతున్నది. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా తక్కువ సమయంలో ఇంతగా పాపులారిటీ పోగొట్టుకున్న...

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe Biden) ప్రజాదరణ తగ్గిపోతున్నది. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా తక్కువ సమయంలో ఇంతగా పాపులారిటీ పోగొట్టుకున్న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. ఇప్పటికిప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిపితే జో బైడెన్ చాలా ఇబ్బంది పడతాడు. డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చే వాడు. ఈ విషయాలను అమెరికాకు చెందిన ఎమర్షన్ కాలేజీ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేను ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు నిర్వహించారు.
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకున్న కారణంగా జో బైడెన్ తీవ్రమైన నిరసనలు ఎదుర్కొంటున్నారు. విపక్షం నుంచే కాకుండా స్వపక్షం నుంచి కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఎమర్షన్ కాలేజీ నిర్వహించిన సర్వేలో దాదాపు 47 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటేశారు. ఒక శాతం తక్కువగా బైడెన్‌కు 46 శాతం మంది మద్దతుగా నిలిచారు. 2024 లో అధ్యక్ష పదవికి బైడెన్, ట్రంప్‌లలో ఎవరిని ఎన్నుకుంటారని అని సర్వేలో ప్రశ్నించారు. 60 శాతం మంది డెమోక్రాట్లు 2024 లో బైడెన్ అధ్యక్ష అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇదే సమయంలో, 67 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్‌ను తమ అభ్యర్థిగా పేర్కొంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో ఎవరు ఎక్కువ బాధ్యత వహించాలి? అన్న ప్రశ్నకు ప్రతిస్పందనగా.. ట్రంప్‌కు ప్రజల నుంచి మద్దతు లభించింది. 49 శాతం మంది మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ బాధ్యత వహించాలనగా.. 24 శాతం మంది బైడెన్, 18 శాతం మంది బరాక్ ఒబామా తప్పని వెల్లడించారు.
ఏప్రిల్‌లో ముందుండి.. ఆగస్ట్‌లో తగ్గి..
గత నెల 17 న జరిగిన ఒక సర్వేలో, ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని ఎదుర్కోవడానికి ట్రంప్ సరైన చర్యలు తీసుకున్నారని 25 శాతం మంది చెప్పగా.. సైన్యం ఉపసంహరణపై 60 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. బైడెన్ ప్రజాదరణ ఏప్రిల్‌లో 53 శాతం నుంచి 49 శాతంగా ఉండగా.. ఆగస్ట్ నెలాఖరుకు దాదాపు 7 శాతం తగ్గిపోయింది. ఈ ఏడాది నవంబర్ నెలలో యూఎస్‌లో ప్రతినిధుల సభ, సెనేట్ స్థానాలకు మధ్యంతర ఎన్నికలు జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
Star Trek : స్టార్ ట్రెక్ సిరీస్‌కు 55 ఏండ్లు
వైఫై పాస్వర్డ్ కావాలా? ఈ లెక్క ముడి విప్పండి..!
రక్తపోటు పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
Rajinikanth | గ్రీస్‌లో అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్యల వివాహం.. కొత్త జంటతో రజనీకాంత్ డ్యాన్స్!
Bigg Boss 10 | డబుల్ ఎమోషనల్ సర్ప్రైజ్.. ముకేశ్‌కు తల్లి ప్రేమ,శివకుమార్‌కు ప్రియాంకతో ఎంగేజ్మెంట్!
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

