Star Trek : స్టార్ ట్రెక్ సిరీస్‌కు 55 ఏండ్లు
Star Trek : అమెరికా టెలివిజన్ చరిత్రలో కొత్త శకాన్ని సృష్టించిన స్టార్‌ట్రెక్ ప్రదర్శించి ఇవ్వాల్టికి సరిగ్గా 55 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సిరీస్‌ను అమెరికా ఎన్బీసీ ఛానల్లో...

అమెరికా టెలివిజన్ చరిత్రలో కొత్త శకాన్ని సృష్టించిన స్టార్‌ట్రెక్ (Star Trek) ప్రదర్శించి ఇవ్వాల్టికి సరిగ్గా 55 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సిరీస్‌ను అమెరికా ఎన్బీసీ ఛానల్లో ప్రసారం చేశారు. అంతరిక్షంలో అడ్వెంచర్స్ చేస్తూ ప్రేక్షకులను తమతో పాటు అంతరిక్షంలోకి తీసుకెళ్లిన ఈ సిరీస్.. అమెరికా ఎంటైర్టైన్మెంట్ పరిశ్రమలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా ఫ్రాంచైజీగా నిలిచింది.
రచయిత, నిర్మాత జీన్ రాడెన్బరీ ఆలోచనల నుంచి స్టార్ ట్రెక్ జీవం పోసుకున్నది. రచయితగా మారక ముందు జీన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా పనిచేసిన అనుభవం ఉన్నది. 23 వ శతాబ్దపు ఆవిష్కరణలను దృష్టిలో ఉంచుకుని స్టార్ ట్రెక్ సిరీస్‌ను రూపొందించాడు. సభ్యుల అంతరిక్ష అన్వేషణ సాహసాలను కథ అనుసరిస్తుంది. దీనిని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ ప్లానెట్స్, స్టార్‌షిప్ యూఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ సృష్టించింది.
ప్రారంభంలో నిర్మించిన 3 సీజన్లను ప్రస్తుతం ఒరిజినల్ సిరీస్‌గా పిలుస్తారు. స్టార్ ట్రెక్ ద్వారా ఒరిజినల్ సిరీస్ కాకుండా తొమ్మిది స్పిన్-ఆఫ్ టీవీ సిరీస్‌లు, 6 చిత్రాలతో కూడిన ఫిల్మ్ ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి. ఇది అనేక మీడియాలో విభిన్న రూపాల్లో ప్రసారమైంది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
నేడు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
2009: కొత్త సౌకర్యాలతో విమాన వాహక నౌక అడ్మిరల్ గోర్ష్కోవ్ను సిద్ధం చేసేందుకు రష్యాకు 100 మిలియన్ డాలర్లు ఇచ్చిన భారత్
2008 : మహారాష్ట్రలోని మాలేగావ్‌లో బాంబులు పేలి 37 మంది దుర్మరణం
1991: స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా
1962: భారతదేశం తూర్పు సరిహద్దులోకి చొరబడిన చైనా
1960: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గాంధీ మరణం
1952: జెనీవాలో కాపీరైట్ మొదటి ప్రపంచ సదస్సుపై సంతకం చేసిన భారతదేశంతో పాటు 35 దేశాలు
1951: 48 దేశాలతో శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్న జపాన్
1933: ప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే జననం
1926: భారతరత్న భూపేన్ హజారికా జననం
ఇవి కూడా చదవండి..
వైఫై పాస్వర్డ్ కావాలా? ఈ లెక్క ముడి విప్పండి..!
రక్తపోటు పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

