China army : యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా.. 252 పేజీల అమెరికా డాక్యుమెంట్
China army : చైనా ఆర్మీకి సంబంధించిన విషయాలను ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు. అందులోనూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి ఊసే ఉండదు. తమ వద్ద ఎంత సైన్యం ఉన్నది, ఎన్ని యుద్ధ ట్యాంకులు, ఆయుధ సంపత్తి ఉన్నది ...

హాంగ్‌కాంగ్ : చైనా ఆర్మీకి సంబంధించిన విషయాలను ప్రపంచానికి చాలా తక్కువగా తెలుసు. అందులోనూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి ఊసే ఉండదు. తమ వద్ద ఎంత సైన్యం ఉన్నది, ఎన్ని యుద్ధ ట్యాంకులు, ఆయుధ సంపత్తి ఉన్నది చైనా అసలే బయటపెట్టదు. ఈ నేపథ్యంలో చైనా ఆర్మీకి (China army) సంబంధించిన పలు విషయాలను అమెరికా డాక్యుమెంట్ రూపంలో బయటపెట్టింది. ఈ డాక్యుమెంట్‌ను అమెరికా ఆర్మీ విడుదల చేసింది. 252 పేజీలుగా ఉన్న ఈ నివేదికకు ‘ఏటీపీ 7-100.3’ అని పేరు పెట్టింది. ఈ నివేదిక చైనా పీపుల్స్ ఆర్మీ నిర్మాణం, సామర్ధ్యం గురించి వెల్లడిస్తుంది. అమెరికా ఆర్మీ శిక్షణ కోసం ఈ డాక్యుమెంట్ రూపొందించారు.
చైనా రక్షణాత్మకంగా భావించే పలు నిర్ణయాలు, ఇతర దేశాలకు దూకుడుగా ఉంటాయని ఈ నివేదికలో వెల్లడించారు. దక్షిణ చైనా సముద్రంలో ఒక కృత్రిమ ద్వీపాన్ని నిర్మించాలనే నిర్ణయం దీనికి సరైన ఉదాహరణగా పేర్కొన్నారు. అయితే, డాక్యుమెంట్లో చైనా సైన్యం గురించి మాత్రమే ప్రస్తావించారు. 20 సంవత్సరాల పాటు చైనా సైన్యాన్ని నిరంతరం చూసిన తర్వాత అమెరికా ఈ నివేదికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తున్నది.
ఇదీ నిర్మాణం.. సామర్ధ్యం..
చైనా పీపుల్స్ ఆర్మీలో మూడు కమాండ్స్.. లైట్ వెహికిల్ ఆర్మీ, హెవీ హ్యాండెడ్ ఆర్మీ, ఆర్మర్డ్ వెహికిల్స్ ఉన్నాయి. చైనా ప్రభుత్వం ప్రస్తుతం సైన్యంపై పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం ద్వారా కొత్త ఆయుధాలను తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసి అమలుపరుస్తున్నది. 2035 నాటికి చైనా తన పాత ఆయుధాలన్నింటినీ తొలగిస్తుందని భావిస్తున్నారు. సైనిక వాహనాల విషయంలో అమెరికా సైన్యం కంటే చైనా సైన్యం ముందున్నది. చైనాలో కూడా 18 రిజర్వ్ ఫోర్స్ యూనిట్లు ఉన్నాయి. కానీ, అవి యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా పరిగణించడం లేదు.
ముఖ్య బ్రిగేడ్లకు ఆధునిక ఆయుధాలు..
చైనీస్ ఆర్మీలోని అతి ముఖ్యమైన బ్రిగేడ్లకు ముందుగా ఆత్యాధునిక ఆయుధాలు ఇచ్చారు. ఇక్కడి పాత ఆయుధాలను తక్కువ ప్రాముఖ్యత కలిగిన బ్రిగేడ్లకు పంపారు. ఇటీవల లడఖ్‌లో భారతదేశం-చైనా సైనికుల మధ్య వాగ్వివాదం జరిగిన సమయంలో సరిహద్దులోని జిన్జియాంగ్ మిలటరీ జిల్లాకు చైనా కొత్త సైనిక పరికరాలను పంపింది. వీటన్నింటిని బట్టి చూస్తే చైనా యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు తేటతెల్లమవుతున్నదని అమెరికా తన డాక్యుమెంట్లో పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి..
జో బైడెన్‌కు తగ్గిన ప్రజాదరణ.. ఎందుకంటే..?
Star Trek : స్టార్ ట్రెక్ సిరీస్‌కు 55 ఏండ్లు
వైఫై పాస్వర్డ్ కావాలా? ఈ లెక్క ముడి విప్పండి..!
రక్తపోటు పెరుగుతోందా? ఈ ఆహారాలు తీసుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

