e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, May 17, 2021
Home సినిమా రాజకీయాల్లో మా దారులు వేరు

రాజకీయాల్లో మా దారులు వేరు

రాజకీయాల్లో మా దారులు వేరు

‘నా జీవితంలోని ప్రతి రోజును పండుగలా జరుపుకొంటాను. ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపాలన్నదే నేను నమ్మే సిద్ధాంతం’ అని అన్నారు ప్రకాష్‌రాజ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వకీల్‌సాబ్‌’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా విశేషాల్ని గురించి ప్రకాష్‌రాజ్‌ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…

కమర్షియల్‌ అంశాలు లేకుండా ఇలాంటి కథల్ని చెప్పడం సాధ్యం కాదని అంటారా?
పవన్‌కల్యాణ్‌ నమ్మే విషయాల్ని స్పృశిస్తూ సమకాలీన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. సినిమాపై ఎన్నో అంచనాలున్నాయి. సినిమాలో ఫైట్స్‌, డ్యాన్సులు ఉండాలని ప్రేక్షకులు కోరుకున్నారు.
అభిమానులను సంతృప్తిపరుస్తూ వారు కోరుకున్న అంశాలకు చెప్పాలనుకున్న పాయింట్‌ను జోడిస్తూ తెరకెక్కించారు. సినిమాతో దర్శకనిర్మా తలు అందరిని సంతృప్తిపరిచారు.

సినిమాలో మీ పాత్రకు మంచి ప్రశంసలొస్తున్నాయి..?
ఈ విజయం నా ఒక్కడిదే కాదు. టీమ్‌ వర్క్‌ వల్లే సక్సెస్‌ సాధ్యమైంది. కథానాయకుడికి ధీటుగా ఉండాలనే నా పాత్రను శక్తివంతంగా దర్శకుడు శ్రీరామ్‌వేణు తీర్చిదిద్దారు. తెర వెనుక టీమ్‌ అంతా ఎంతో కష్టపడ్డారు. ప్రతిరోజు సెట్‌కు వచ్చినట్లుగా కాకుండా కోర్టుకు వచ్చిన ఫీలింగ్‌ కలిగేది. ఓ సీన్‌ ఓకే అవడం వెనుక ఎంతో జర్నీ ఉండేది.

దర్శకనిర్మాతగా మీరు పెద్ద సినిమాలు తీయరెందుకని?
నటుడిగా ‘కాంజీవరం’ లాంటి చిన్న సినిమాలతో పాటు ‘వకీల్‌సాబ్‌’ లాంటి పెద్ద చిత్రాల్లో భాగమవ్వాలని కోరుకుంటా. కమర్షియల్‌ సినిమాల్లో నటించడం తెలుసు కానీ. అలాంటివి తీయడం నాకు రాదు. చిన్న బడ్జెట్‌ సినిమాలు మాత్రమే తీస్తాను.

రాజకీయాల పరంగా పవన్‌కు, మీకు మధ్య అభిప్రాయభేదాలున్నాయి? ఆ ప్రభావం సినిమాల్లో కనిపిస్తుందా?
రాజకీయాల పరంగా భిన్నాభిప్రాయాలు ఉండటం తప్పుకాదు. పవన్‌ను నేను చాలా ప్రేమిస్తా. తెలుగు రాష్ర్టాల్లో ఘనమైన అభిమానగణాన్ని కలిగిన మంచి నాయకుడు. ఆయన వెళ్లే దారి నాకు నచ్చలేదు. మా మధ్య అభిప్రాయభేదాలున్నా నన్ను గౌరవిస్తానని పవన్‌కల్యాణ్‌ అన్నారు. అలాంటి సంస్కృతి ఉండాలి. నేను ప్రేమించేవారు నా ఆలోచనలకు తగినట్లుగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. షూటింగ్‌ సమయంలో మేమిద్దరం దేశం, వ్యవసాయంతో పాటు రాజకీయ అంశాల గురించి మాట్లాడుకున్నాం. నేను రాసిన ‘దోసిట చినుకులు’ పుస్తకం చదివానని ఆయన నాతో చెప్పారు. మీ ఐడియాలజీ డిఫరెంట్‌గా ఉంది. ఈ యాంగిల్‌లో మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదన్నారు. మా మధ్య విషయాలన్నీ ఆరోగ్యకరమైనవిగా ఉంటాయి.

ఈ అభిప్రాయభేదాలకు కారణమేమిటని అనుకోవచ్చు?
జనాలకు మంచి చేయాలని పవన్‌, నేను విశ్వసిస్తాం. జనం, దేశం, తెలుగు వారి పట్ల మా ఇద్దరిలో ఒకే రకమైన ప్రేమ ఉంది. అబద్ధాలు చెప్పకూడదనే మేము విశ్వసిస్తాం. ఏ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నామనే విషయంలో భిన్నమైన భేదాభిప్రాయాలున్నాయి. వ్యక్త్తిగతంగా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు.

సినిమాల వేగాన్ని తగ్గించారెందుకని?
ప్రస్తుతం తెలుగులో మాత్రం ఎక్కువగా సినిమాలు చేయడంలేదు. అందరికి నేను కావాలి. నాకు అందరూ కావాలి. ఇతర భాషల్లో సినిమాలు చేయడం వల్లే తెలుగులో గ్యాప్‌ వస్తోంది. దర్శకనిర్మాతగా ఈ ఏడాది సినిమా మొదలుపెట్టే ఆలోచన ఉంది.

రాజకీయపరంగా మీకు ఎదురైన ఒడిదుడుకుల్ని ఎలా స్వీకరిస్తారు?
రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఓపిక కావాలి. జనాలు మనలోని మంచిని గ్రహించడానికి సమయం పడుతుంది. మంచి ఆశయాలతో వచ్చినప్పుడు కొన్ని కష్టాలు ఎదురవుతాయి. అనుకున్నదానికంటే రాజకీయం చాలా పెద్దది. అందులోని విషాన్ని, వ్యూహాన్ని ఛేదిస్తూ ముందుకు సాగడానికి టైమ్‌ పడుతుంది.

Advertisement
రాజకీయాల్లో మా దారులు వేరు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement