Vistara | విమానం వాష్‌రూమ్‌లో పొగతాగి.. కటకటాలపాలైన ప్రయాణికుడు
Vistara | విమానం వాష్‌రూమ్‌లో సిగరెట్ తాగి (man smokes on flight) కటకటాల పాలయ్యాడు ఓ వ్యక్తి.
Vistara | విమాన ప్రయాణంలో చోటు చేసుకునే కొన్ని ఘటనలు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తుంటాయి. ముఖ్యంగా ప్రయాణికుల ప్రవర్తన చర్చకు దారితీస్తుంటుంది. కొందరు వ్యక్తులు విమాన ప్రయాణంలో ఏవి చేయకూడదో అవే చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి విమానం వాష్‌రూమ్‌లో సిగరెట్ తాగి (man smokes on flight) ఇప్పుడు కటకటాల పాలయ్యాడు.
తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన బాలకృష్ణ రాజయన్ అనే 51 ఏళ్ల వ్యక్తి.. సోమవారం నాడు విస్తారా యూకే-234 ఫ్లైట్‌లో ఒమన్‌లోని మస్కట్ నుంచి ముంబై (Muscat to Mumbai) వరకూ ప్రయాణించాడు. ఆ సమయంలో అతడు విమానం వాష్‌రూమ్‌లో పొగ తాగాడు. స్మోక్ డిటెక్టర్ సాయంతో ఈ విషయాన్ని గమనించిన పైలట్ వెంటనే క్యాబిన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. అలర్ట్ అందుకున్న సిబ్బంది వాష్‌రూమ్‌ను తనిఖీ చేయగా.. వాష్ బేసిన్లో సిగరెట్ బడ్ కనిపించింది. ఇక విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Mumbai airport)ల్యాండ్ కాగానే.. క్రూ సిబ్బంది ప్రయాణికుడి చర్య గురించి సెక్యూరిటీ సూపర్వైజర్కు వివరించారు.
దీంతో అతడిని పిలిపించి విచారణ చేయగా.. వాష్‌రూమ్ లోపల పొగతాగినట్లు అంగీకరించాడు. దీంతో అధికారులు ముంబైలోని సహర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజయన్ ఉద్దేశపూర్వకంగానే విమానంలో పొగ తాగాడని తెలిపారు. భద్రతా నిబంధనలను ఉల్లంగించి.. విమానంలోని ప్రయాణికులందరినీ ప్రమాదంలో పడేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు.
Also Read..
Rahul Gandhi | అది మీ వ్యక్తిగత అనుభవమా?.. అంబానీ, అదానీ అంశంలో మోదీకి రాహుల్ కౌంటర్
Kerala Governor | అయోధ్య రాముడి ముందు ప్రణమిల్లిన కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

