Ram Charan | టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) ముంబై (Mumbai) వెళ్లారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం అక్కడ ప్రముఖ సిద్ధి వినాయక ఆలయాన్ని (Siddhivinayak Temple) సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా చరణ్‌కు ఆలయ పూజారులు శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#RamCharan from Siddhi Vinayak temple
Show me more spiritual star than him 🙏 pic.twitter.com/K79KTKKLiT
— LetsOTT (@Ietsott) October 4, 2023
మరోవైపు చరణ్ తన కొత్త ఫ్రెండ్ (New Friend)ను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేశారు. ఆ కొత్త నేస్తం ఎవరనుకుంటున్నారు..? గుర్రం. దాని పేరు బ్లేజ్ (Blaze)..! ‘నా కొత్త ఫ్రెండ్ బ్లేజ్..’ అంటూ ఫొటో షేర్ చేశారు. ఆ ఫొటోలో అశ్వం తలపై చరణ్ నెమురుతూ కనిపించారు. చరణ్‌కు గుర్రపు స్వారీలంటే చాలా ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ‘మగధీర’ సినిమాలో కూడా చరణ్ గుర్రపు స్వారీతో ఆకట్టుకున్నారు. ఇప్పటికే తన వద్ద కాజల్, బాద్ షా అనే రెండు గుర్రాలున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి బ్లేజ్ వచ్చి చేరింది. ఇక చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ (Game Changer )లో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Giving Respect And Taking Care Of Elders , Ladies , Kids👌❤️
Idol @AlwaysRamCharan 🙏🏻#RamCharan #GameChanger pic.twitter.com/QfNgMj2s4q
— Tirupati RamCharan Fans (@TirupatiRCFans) October 4, 2023
Also Read..
Vande Bharat | వందేభారత్ స్లీపర్ కోచ్.. ఫొటోలు చూశారా..?
Sikkim Floods | సిక్కింని ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
Asian Games: జ్యోతి, ఓజాస్ సూపర్ షో.. ఆర్చరీలో భారత్‌కు గోల్డ్