Sikkim Floods | ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim)ని ఆకస్మిక వరదలు (Flash Floods) ముంచెత్తాయి. గత రాత్రి కురిసిన కుండపోత వర్షానికి ఉత్తర సిక్కింలోని లాచెన్ లోయలో గల తీస్తా నది (Teesta River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది (23 Soldiers Missing) గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. వారి కోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు ప్రాంతంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో తీస్తా నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. అదే సమయంలో చుంగ్‌థాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో పరిస్థితి తీవ్రతరమైంది. దిగువ ప్రాంతంలో నీటిమట్టం 20 అడుగుల మేర పెరిగింది. దీంతో అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ (Cloudburst) వల్ల వరదలు వెల్లువెత్తాయి.
సింగ్టామ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇందులో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. గల్లంతైన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆకస్మిక వరదల వల్ల లాచెన్ లోయ వెంబడి ఉన్న అనేక ఆర్మీ స్థావరాలకు కూడా భారీ నష్టం వాటిల్లింది. నది పొంగి ప్రవహించడంతో తీస్తా నదిపై ఉన్న సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది.
ఆకస్మిక వరదలతో రాష్ట్రంలోని చాలా రోడ్లు, వంతెనలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన సిక్కిం ప్రభుత్వం బుధవారం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీస్తా నది సమీప ప్రాంతానికి వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.
Flash Flood in #Sikkim:
Due to sudden cloud burst.23 Army Personnel are Missing !Prayers for Sikkim 🙏🏻🥺 pic.twitter.com/CyQVXDu7uJ
— Sachin More 🔱🚩 (@SM_8009) October 4, 2023
Due to a sudden cloud burst over Lhonak Lake in North Sikkim, a flash flood occurred in Teesta River in Lachen Valley. Some army establishments along the valley have been affected and efforts are on to confirm details. 23 personnel have been reported missing and some vehicles are… pic.twitter.com/nDUTaHiWDj
— ANI (@ANI) October 4, 2023
23 army personnel have been reported missing due to a flash flood that occurred in Teesta River in Lachen Valley after a sudden cloud burst over Lhonak Lake in North Sikkim: Defence PRO, Guwahati https://t.co/zDabUMrCaI pic.twitter.com/uWVO1nsT2T
— ANI (@ANI) October 4, 2023
#WATCH | Sikkim: A flood-like situation arose in Singtam after a cloud burst.
(Video source: Central Water Commission) pic.twitter.com/00xJ0QX3ye
— ANI (@ANI) October 4, 2023
Also Read..
Italy Bus Accident | బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. ఇద్దరు పిల్లలు సహా 21 మంది దుర్మరణం
Tragedy | వారం రోజుల్లో కూతురి పెండ్లి.. బ్రిటన్‌లో హైదరాబాదీ దారుణ హత్య
Samantha | మీరింత ఖాళీగా ఉన్నారా? ట్రోలర్స్‌పై మండిపడ్డ సమంత