Italy Bus Accident | బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. ఇద్దరు పిల్లలు సహా 21 మంది దుర్మరణం
Italy Bus Accident | ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో వచ్చిన ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనీస్‌లోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి మాంటేరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Italy Bus Accident | ఇటలీలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంతో వచ్చిన ఓ బస్సు బ్రిడ్జిపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెనీస్‌లోని చారిత్రక ప్రాంతాలను సందర్శించి మాంటేరా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం వెనీస్ నుంచి మాంటేరాకు బస్సు బయల్దేరింది. రాత్రి 7 :30 గంటల ప్రాంతంలో వెనీస్ బ్రిడ్జిపైకి రాగానే అదుపుతప్పిన బస్సు కిందపడిపోయింది. 50 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వైర్లపై పడటంతో బస్సులో నుంచి మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. బస్సు తగలబడటంతో అందులోని ప్రయాణికులకు కూడా మంటలు అంటుకున్నాయని తెలిపారు. ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో ఇద్దరు పిల్లలు సహా 21 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో గాయపడినవారిని రెస్క్యూ సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చాలామంది క్షతగాత్రులను కాలిపోయిన దశలోనే ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. దీంతో మరణాల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా, ప్రమాదానికి ముందు బస్సు డ్రైవర్ అస్వస్థతకు గురై ఉంటారని వెన్నీస్ నగర కౌన్సిలర్ రెనాటో బోరాసో తెలిపారు. ఇక బస్సు ప్రమాదంపై ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Italy2
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

