Samantha | సమంత, చైతూ కలిసి ఉన్న రోజుల్లో ఒక కుక్కపిల్లను పెంచుకున్నారు. ఆ కుక్కపిల్ల పేరు హష్. ఈ జంట విడిపోయిన తర్వాత తను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే హష్ని కూడా వెంటబెట్టుకొని తీసుకెళ్లిపోయింది సమంత. గత కొన్నేళ్లుగా సమంత ఇన్‌స్టా రీల్స్‌లో కూడా హష్ దర్శనమిస్తూనేవుంది. నిజానికి ఈ కుక్క సమంత, చైతూ దగ్గర తప్ప ఎక్కడా ఉండదని తెలిసింది.
రీసెంట్గా ఓ అభిమాని కొత్తగా కొన్న బైక్‌ని నాగచైతన్య టెస్ట్ డ్రైవ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో అనుకోకుండా హష్ దర్శనమిచ్చింది. దీంతో గాసిప్ రాయుళ్లకు పని దొరికినట్లయింది. ‘ఏంటి?.. కుక్క చైతూ దగ్గరుంది.. మళ్లీ ఇద్దరు కలిశారా ఏంటి? అంటూ కామెంట్లు పెడుతున్నారంట. దీంతో సామ్‌కి చిర్రెత్తుకొచ్చి ‘ మీరు ఇంత ఖాళీగా ఉన్నారని నాకు తెలియదు. కనీసం ఏదైనా బుక్ అయినా చదువుకోపోయారా?.. జ్ఞానం వస్తుంది.’ అంటూ సున్నితంగా మందలించారు సమంత.