జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కొరటాల శివ (Siva Koratala), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్లో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ 30 (NTR 30) మూవీ మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. అయితే సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఇప్పటివరకు అప్డేట్ రాలేదు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఎన్టీఆర్ 30 మూవీ కోసం అల్లు స్టూడియోస్‌లో కొత్త సెట్ ఒకటి వేయబోతున్నారన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కథానుగుణంగా వివిధ రకాల సెట్స్‌లో ఈ సినిమా చిత్రీకరించాల్సి ఉందట. అనంతరం ఈ సన్నివేశాలకు వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని యాడ్ చేయబోతున్నారని ఇన్సైడ్ టాక్.
ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై అధికారిక ప్రకటన ఏం రాకున్నా..ప్రస్తుతానికి రష్మిక మందన్నా పేరు పరిశీలనలో ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ కథనం. తారక్‌ను ఇదివరకెన్నడూ చూడని విధంగా సరికొత్త అవతారంలో చూపించడం కోసం పర్ఫెక్ట్గా సరిపోయే కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడట కొరటాల. అందుకోసమే ఎక్కువ సమయం తీసుకుంటున్నాడని చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణంలో మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా..రత్నవేల్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
Read also : Sidhu Jonnalagadda | అట్లుంటది మనతోని.. డీజేటిల్లు 2 హీరోయిన్ ఎవరో చెప్పిన సిద్దు
Read also : Chiranjeevi | చిరంజీవిని కలిసిన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు
Read also : Prakash Raj | ప్రకాశ్ రాజ్ డబ్బింగ్ షురూ.. ఇంతకీ ఏ సినిమాకంటే..?
Read also : Kriti Sanon | ఆదిపురుష్ కొత్త అప్డేట్.. డబ్బింగ్ స్టూడియోలో కృతిసనన్