Regina Cassandra | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా కాలం బాలీవుడ్ (Bollywood)దే హవా నడిచిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే రాను రాను హిందీ సినిమాల హవా తగ్గిపోయి దక్షిణాది చిత్రాల ఇమేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు హిందీ సినిమాలో సౌతిండియన్ యాక్టర్లున్నారంటే క్రేజ్ అమాంతం పెరిగిపోతుందంటే.. దక్షిణాది యాక్టర్లు ఎలాంటి ప్రభావం చూపించారో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం గురించి చిట్‌చాట్‌లో మాట్లాడింది రెజీనా కసాండ్రా (Regina Cassandra).
మగిజ్ తిరునేని డైరెక్షన్లో అజిత్ కుమార్ నటిస్తోన్న పట్టుదలలో వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది రెజీనా. ప్రస్తుత పరిస్థితుల గురించి రెజీనా మాట్లాడుతూ.. బాలీవుడ్లో గతంలో క్లిష్ట పరిస్థితులుండేవి. సౌతిండియన్ యాక్టర్లకు అక్కడ అవకాశాలు దొరకడం కష్టంగా ఉండేది. అప్పట్లో మీరు సౌత్ నుంచి వచ్చారని తెలిస్తే అవకాశాలు ఇచ్చేవాళ్లు కాదు. దీనికి భాషాపరమైన ఇబ్బందుకు కూడా కారణం కావొచ్చు. కానీ కరోనా తర్వాత ఇండస్ట్రీలో పరిస్థితులు మారిపోయాయి.
సౌతిండియా యాక్టర్లకు వాళ్లు కూడా అవకాశాలిస్తున్నారు. తమ సినిమాలకు ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరవేయాలంటే దక్షిణాది నటీనటులను ఎంపిక చేయడం తప్పనిసరైందంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు తాను హిందీ సినిమాకు సైన్ చేశానని.. త్వరలోనే వివరాలు కూడా షేర్ చేసుకుంటానంది. పట్టుదల సినిమాలో నాది పాజిటివ్ రోల్ లేదా నెగెటివ్ రోల్ అని మాట్లాడుకుంటున్నారు. ప్రేక్షకులకు నా పాత్ర గురించి ఆ విధంగా మాట్లాడుకోవడం ఎంతో నచ్చిందని పేర్కొంది.
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!