టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్లో చేస్తున్న చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా తాత్కాలికంగా బ్రేక్పడ్డది. ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతలకు (AP farmers) అండగా నిలిచేందుకు కొంత కాలంగా కౌలు రైతు భరోసా యాత్రలో బిజీగా ఉన్నారు పవన్ కల్యాణ్. ఇక త్వరలో మళ్లీ మేకప్ వేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్త అభిమానుల్లో జోష్ నింపుతోంది.
తాజా అప్ డేట్ ప్రకారం త్వరలోనే షూటింగ్ పనులను షురూ చేయబోతున్నాడట. మొదట హరిహర వీరమల్లు చిత్రీకరణ మొదలుపెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. ఇక ఆ వెంటనే సముద్రఖని డైరెక్షన్లో చేయబోతున్న వినోధయ సీతమ్ తెలుగు రీమేక్ షూటింగ్లో సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించబోతున్నాడు. అక్టోబర్ నుంచి ఏపీ వ్యాప్తంగా పొలిటికల్ టూర్ మొదలుపెట్టనున్నారు పవన్ కల్యాణ్.
ఆ లోపు ప్రస్తుతం చేస్తున్న సినిమాలను పూర్తి చేయనున్నాడు పవన్ కల్యాణ్. హరిహరవీరమల్లు చిత్రంలో నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) వన్ ఆఫ్ ది ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్..కాగా సీనియర్ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.