Poonam Kaur | ఇండస్ట్రీ సమస్యలతోపాటు సామాజిక అంశాలపై ఎప్పటికపుడు తనదైన శైలిలో స్పందిస్తుంటుంది నటి పూనమ్ కౌర్ (Poonam Kaur). ఏదో ఒక ట్వీట్‌తో వార్తల్లో నిలుస్తుండే ఈ భామ తాజాగా ఎక్స్‌లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. త్రివిక్రమ్ (Trivikram Srinivas)పై చాలా కాలం క్రితమే ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నా. త్రివిక్రమ్ వల్ల నా జీవితంలో ఆనందం కోల్పోయాను. ఇప్పటివరకు త్రివిక్రమ్‌ను ఎవరూ ప్రశ్నించలేదు. త్రివిక్రమ్‌కు పెద్దల సపోర్ట్ ఉందని ట్వీ్ట్ చేసింది పూనమ్ కౌర్ .
అయితే దీనిపై మా అసోసియేషన్ స్పందించింది. మా అసోసియేషన్ కోశాధికారి శివబాలాజీ (Shiva balaji)మాట్లాడుతూ.. మాకు పూనమ్‌కౌర్ నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నాడు. ట్వీట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మా అసోసియేషన్, కోర్టును ఆశ్రయిస్తే పూనంకౌర్‌కు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశాడు శివబాలాజీ. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
No questioning or even action taken on director #Trivikramsrinivas for complaint give in maa association for very long , he rather is encouraged by the big wigs after damaging my life which has affected health and happiness .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) January 5, 2025
మహిళలెవరికీ సమస్య ఉండదు..
పూనమ్ కౌర్ సీఎంతో సమావేశానికి మహిళలెవరూ కూడా ముఖ్యమైన వ్యక్తులుగా పరిగణించబడలేదంటూ ఇటీవలే ఓ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మహిళలకు ఎలాంటి సమస్యలుండవు. వ్యాపార సంబంధ విషయాలు, హీరోకు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం పరిశ్రమ నిలబడుతుంది. కానీ మహిళలెవరికీ సమస్య ఉండదు.. అంటూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది పూనమ్ కౌర్. ఈ కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చయాంశంగా మారాయి.
No women was considered important enough to be taken for a meeting with CM , women have absolutely no issues , industry stands up when a hero has a issue or trade matters , no women has issue – none can have one .
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) December 26, 2024
Madha Gaja Raja | 12 ఏండ్లకు థియేటర్లలోకి.. విశాల్ మదగజరాజ రిలీజ్ టైం ఫిక్స్
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్