TFPC | అడ్వాన్స్‌లు తీసుకుని షూటింగ్స్ పూర్తి చేయని నటీనటులపై తమిళ సినీ నిర్మాతల మండలి (Tamil Film Producers Council) కొరడా ఝళిపించింది. అడ్వాన్స్‌లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని ధనుష్ (Dhanush)పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ధనుష్ తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై అనుమతులు ఉంటేనే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్మాతల మండలి నిర్ణయించింది.
ఈ మేరకు ఆగస్టు 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్స్‌ను నిర్మాతల మండలి నిలిపేయాలని నిర్ణయించింది. పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తర్వాతే కొత్త సినిమాల షూటింగ్స్ చేసుకునే అవకాశం కల్పించాలని మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న సినిమాలు, ఇచ్చిన అడ్వాన్స్‌లపై నిర్మాతలను మండలి నివేదిక అడిగింది. ఇకపై సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్షీట్లు ఇచ్చేలా నిర్మాతల మండలి ఏర్పాట్లు చేస్తోంది. ఏ హీరోహీరోయిన్ కూడా ఇకపై అడ్వాన్స్‌లు తీసుకోవడం నిషేధం విధించినట్టు సమాచారం.
నిర్మాతల మండలి కొత్త నిర్ణయాల్లో కొన్ని..
స్టార్ యాక్టర్ల సినిమాలు థియేటర్లలో విడుదలైన 8 వారాల (56 రోజులు) తర్వాత మాత్రమే OTT ప్లాట్‌ఫాంలో విడుదల చేయాలి. ఆగస్టు 15 తర్వాత కొత్త తమిళ సినిమా షూటింగ్లుండవు.
అక్టోబర్ 31లోపు ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలి.
నవంబర్ 1 నుండి షూటింగ్‌కు అనుమతి ఉండదు.
🚨 New Rules from #TFPC! 🚨
The Tamil Film Producers Council has announced new regulations:
-Big star movies can only hit OTT platforms 8 weeks (56 days) after their theatrical release. 🎬✨
-No new Tamil movie shoots can begin after August 15th. 🗓️
-All ongoing projects must… pic.twitter.com/molRwJtdXZ— Kollywood Now (@kollywoodnow) July 29, 2024
Raja Saab | సూపర్ స్టైలిష్ రాజాసాబ్గా ప్రభాస్ ఎంట్రీ.. మారుతి గ్లింప్స్ అదిరిందంతే..!
Thug life | డబ్బింగ్ స్టూడియోలో కమల్‌హాసన్.. థగ్ లైఫ్ టీం కొత్త వార్త ఇదే..!
Double ISMART | డబుల్ ఇస్మార్ట్ రొమాంటిక్ మెలోడీగా రామ్, కావ్య థాపర్ Kya Lafda సాంగ్
Chiyaan Vikram | చియాన్ 63 డైరెక్టర్ ఫైనల్ అయినట్టే.. క్లారిటీ ఇచ్చేసిన విక్రమ్