రంగ్ దే 8 డేస్ కలెక్షన్స్ .. లక్ష్యానికి చాలా దూరంలో నితిన్
రంగ్ దే కలెక్షన్స్ | రంగ్ దే కలెక్షన్స్ 4 రోజుల తర్వాత దారుణంగా పడిపోయాయి. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి 4 రోజుల్లోనే 14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే ఐదో రోజు నుంచి పడిపోయింది.

అనుకున్నదే జరుగుతుంది.. నితిన్ సినిమాది ఆరంభ శూరత్వమే అని మరోసారి రుజువైంది. ఈయన నటించిన రంగ్ దే కలెక్షన్స్ 4 రోజుల తర్వాత దారుణంగా పడిపోయాయి. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన ఈ చిత్రం తొలి 4 రోజుల్లోనే 14 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అయితే ఐదో రోజు నుంచి పడిపోయింది. సెలవులు లేకపోవడం.. కరోనా కేసులు కూడా పెరిగిపోతుండటంతో రంగ్ దే వైపు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇప్పటి వరకు 8 రోజుల రన్ పూర్తి చేసుకున్న రంగ్ దే.. రూ.16 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓ రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాకు వచ్చిన టాక్ పరంగా చూస్తే మంచి వసూళ్లే కానీ లక్ష్యం మాత్రం చాలా దూరంలోనే ఉండిపోయింది. ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే అక్షరాలా రూ. 24 కోట్లు వసూలు చేయాలి.

రంగ్ దే 8 రోజుల కలెక్షన్స్ ..
నైజాం: 5.57 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.71 కోట్లు
సీడెడ్: 2.08 కోట్లు
ఈస్ట్: 1.04 లక్షలు
వెస్ట్: 66 లక్షలు
గుంటూరు: 1.20 కోట్లు
కృష్ణా: 71 లక్షలు
నెల్లూరు: 51 లక్షలు
ఏపీ, తెలంగాణ 8 రోజుల మొత్తం: 13.87 కోట్లు (22.12 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 75 లక్షలు
ఓవర్సీస్: 1.76 కోట్లు
8 రోజుల వరల్డ్ వైడ్ టోటల్ : 16.02 కోట్లు (27.60 కోట్ల గ్రాస్)
ఈ సినిమా సేఫ్ కావాలంటే మరో రూ.8 కోట్లు వసూలు చేయాలి. ఇప్పటికే చాలా చోట్ల వసూళ్లు పడిపోవడంతో నితిన్ సినిమా అంత దూరం వెళ్తుందడనుకోవడం అత్యాశే అవుతుంది. దాంతో రంగ్ దే సినిమా కూడా ఫ్లాప్ లిస్టులోకి వెళ్లిపోయేలా కనిపిస్తుంది. దానికితోడు వైల్డ్ డాగ్, సుల్తాన్ లాంటి సినిమాలు రావడంతో నితిన్ సినిమాపై ఆసక్తి కూడా తగ్గిపోయింది. ఎలా చూసుకున్నా కూడా నితిన్‌కు రంగ్ దే రూపంలో మరోసారి నిరాశ తప్పలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
యువరత్న 2 డేస్ కలెక్షన్స్.. పవర్ స్టార్ పాచిక పారలేదుగా..!
వైల్డ్ డాగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
హిందీలో రష్మిక మందన్న, హన్సికను ఓడించిన అల్లు శిరీష్
లాక్డౌన్ విధించకండి: మహా సీఎంకు సినీ పరిశ్రమ వినతి
‘పుష్ప’ నుంచి మరో క్రేజీ అప్డేట్
వకీల్ సాబ్ సినిమాలో మెగా హీరో గెస్ట్ రోల్
రజనీకాంత్ తో ఈ ఫోటోలో ఉన్న సూపర్ స్టార్ ఎవరో తెలుసా..?
ఉదిత్ నారాయణ్ కుటుంబంలో కరోనా కలకలం
రికార్డు స్థాయి థియేటర్లలో వకీల్ సాబ్ రిలీజ్
అందంతో మాయ చేస్తున్న రాయ్‌లక్ష్మీ..స్టిల్స్
వైష్ణవ్ తేజ్ కోసం క్యూ కడుతున్న దర్శకులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

