టాలీవుడ్ (Tollywood) యాక్టర్ నితిన్ (Nithiin) నటిస్తోన్న తాజా చిత్రం మాచెర్ల నియోజకవర్గం (Macherla Niyojaka Vargam). పొలిటికల్ డ్రామా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి (MS Raja Shekhar Reddy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ఓ క్రేజీ వార్త ఒకటి ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) మాచెర్ల నియోజకవర్గంలో మెరువబోతుందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది.
అయితే తాజా అప్ డేట్ ప్రకారం ఊర్వశి ఫీ మేల్ లీడ్ రోల్లో కాకుండా స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందట. అంతేకాదు మేకర్స్ ఊర్వశి ఎంపికపై అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ చూస్తుండగా..కోటిగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మహతి స్వరసాగర్ మ్యూజిక్ డైరెక్టర్. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 29న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. గతేడాది చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నితిన్. వీటిలో రంగ్ దే మినహా మిగిలిన రెండు చిత్రాలు అంతగా ఆడలేదు.దీంతో ఎలాగైనా ఈ మాచెర్ల నియోకజకవర్గం సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నాడు.