Sebastian PC 524 | హ్యాట్రిక్ హిట్టనుకుంటే.. ‘సెబాస్టియన్’ రూపంలో భారీ డిజాస్టర్..?
‘సెబాస్టియన్ పీసీ 524’ (Sebastian PC524)..ఎస్ఆర్ కళ్యాణమండపం ఫేం కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్టు కొట్టాలనుకున్న హీరో ఆశలన్నీ ఆవిరై పోయాయి.
ఎస్ఆర్ కళ్యాణమండపం ఫేం కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ ప్రాజెక్టు ‘సెబాస్టియన్ పీసీ 524’ (Sebastian PC524 Trailer). మార్చి 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్టు కొట్టాలనుకున్నాడు కిరణ్. కానీ అతడి ఆశలన్నీ ఆవిరై పోయాయి. ఈ చిత్రం బాక్సాపీస్ డీలా పడిపోయింది. బాలాజీ సయ్యపురెడ్డి (Balaji Sayyapureddy) డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కోమలీ ప్రసాద్ (Komalee Prasad), సువేక్ష హీరోయిన్లుగా నటించారు.
ఫిబ్రవరి 25న ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా..అదే రోజు భీమ్లానాయక్ రిలీజ్ ఉండటంతో విడుదలను మార్చి 4కు మార్చారు మేకర్స్. అయితే మార్చి 4న శర్వానంద్ నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లుతో పోటీ ఏర్పడింది. సెబాస్టియన్ గురించి అంతగా టాక్ లేకపోవడం, బాక్సాపీస్ వద్ద నెగెటివ్ రివ్యూస్, బీ,సీ సెంటర్లలో ప్రేక్షకులెవరూ రాకపోవడంతో షోలు రద్ద చేయడం వంటి అంశాలు సినిమాను డేంజర్ జోన్లోకి నెట్టేశాయని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Neha Shetty | అల్లు అర్జున్తో డీజే టిల్లు హీరోయిన్ ప్రోమో అదిరింది
మొత్తానికి ఇటీవల అకాల మరణం చెందిన సోదరుడికి ఈ సినిమాను డెడికేట్ చేస్తున్నట్టు ప్రకటించిన కిరణ్ అబ్బవరానికి సినిమా ప్లాప్ కావడం తీవ్ర నిరాశను మిగిల్చినట్టైందని టాక్ నడుస్తోంది. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై సిద్ధారెడ్డి బి. జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణి రఘువరన్ కీలక పాత్రల్లో నటించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

