కామెడీ సినిమాలు తీయడంలో టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) స్టైల్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మారుతి-పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)తో కలిసి ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజా డీలక్స్ (Raja Deluxe) అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు టాక్. ఈ క్రేజీ కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్టు గురించి ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం మారుతి చాలా మంది స్టార్ హీరోయిన్లను సంప్రదించాడట.
మెహరీన్ ఫిర్జాదా కూడా ఈచిత్రంలో ఛాన్స్ కోసం చాలా ప్రయత్నించినా వర్కవుట్ కాలేదని టాక్. కాగా ఇపుడు మారుతి ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఓ అందాల భామను ఫైనల్ చేశాడని వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ భామ మాళవిక మోహనన్ (Malavika Mohanan). అయితే దీనిపై ఫైనల్ అప్ డేట్ రావాల్సి ఉన్నా..మాళవిక ప్రభాస్తో కలిసి నటించడం దాదాపు ఖాయమైనట్టేనని టాక్ నడుస్తోంది. మాళవిక గతంలో విజయ్ దేవరకొండ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా..ఆ తర్వాత రద్దైంది.
కానీ చాలా రోజుల తర్వాత విజయ్ నటించిన మాస్టర్ (Master) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది. అప్పటినుంచి తెలుగులో స్ట్రెయిట్ బిగ్ సినిమా కోసం ఎదురుచూస్తుందట. ఇక ఇపుడు మారుతి కాంపౌండ్ నుంచి ప్రభాస్ లాంటి హీరోతో ఆఫర్ రావడంతో నో చెప్పేందుకు అవకాశమే లేదని అంటున్నారు సినీ జనాలు.