Neha Shetty | అల్లు అర్జున్‌తో డీజే టిల్లు హీరోయిన్ ప్రోమో అదిరింది
డీజే టిల్లు (DJ Tillu) హీరోయిన్ నేహాశెట్టి (Neha Shetty) స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ నేహాశెట్టి నటిస్తోంది ఏ సినిమాలోనో అనుకుంటున్నారా..? లేదు ఓ యాడ్‌లోనే. అది కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో కలిసి చేస్తోంది.
ఇటీవలే వచ్చిన డీజే టిల్లు (DJ Tillu) సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది నేహాశెట్టి (). ఈ భామ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిందన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇంతకీ నేహాశెట్టి నటిస్తోంది ఏ సినిమాలోనో అనుకుంటున్నారా..? లేదు ఓ యాడ్‌లోనే. అది కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో కలిసి చేస్తోంది. అల్లు అర్జున్ పాపులర్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato)కు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. జొమాటో యాడ్‌కు సంబంధించిన కొత్త ప్రోమోను విడుదల చేశారు.
చాలా ఇంప్రెసిప్ ఉన్న ఈ ప్రోమో చాలా మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ..మంచి వ్యూస్ రాబడుతోంది. మరోవైపు అల్లు అర్జున్ ఇటీవలే పుష్ప..ది రైజ్ తో మంచి హిట్టు కొట్టాడు. సుకుమార్ డైరెక్షన్లో ఈ మూవీకి రెండో పార్టుగా రాబోతున్న పుష్ప..ది రూల్‌తో బిజీగా ఉన్నాడు బన్నీ. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
బన్నీగారు కొంచెం ఫాస్ట్‌గా చేద్దామా..అని నేహాశెట్టి అడుగుతుంటే..హీరో ఎంట్రీ కదా ఆ మాత్రం ఉండాలి..అని బన్నీ అంటున్నాడు. మీరిలా రౌండ్ రౌండ్ తిరుగుతుంటే ఉన్నట్టుండి ఫిజ్జా తినాలనిపిస్తుంది.. అని నేహాశెట్టి అంటుంటే..వెంటనే బన్నీ ఫోన్లో జొమాటో యాప్‌ను చూపిస్తూ.. ఫిజ్జా అయినా పెసరట్టు అయినా జొమాటో ఉందిగా అని చెబుతున్న ప్రోమో ఆకట్టుకుంటోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

