Christmas Release | ప్రతీ యేటా పండగ సీజన్లలో కొత్త సినిమాల సందడి ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే పలు సీజన్లు వెళ్లిపోగా.. ఇక త్వరలో క్రిస్మస్ వచ్చేస్తుందని తెలిసిందే. ఈ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు టాలీవుడ్ యాక్టర్లు. ఇంతకీ ఆ హీరోలెవరనే కదా మీ డౌటు. నితిన్ (Nithiin) , అల్లరి నరేశ్ (Allari Naresh).
నితిన్ నటిస్తోన్న సినిమా రాబిన్‌హుడ్ (Robinhood). వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల (Sreeleela) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. మరోవైపు అల్లరి నరేశ్ నటిస్తోన్న బచ్చలమల్లి కూడా ఇదే తేదీన రానున్నట్టు వార్త ఒకటి తెరపైకి వచ్చింది.
సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వనున్నారట మేకర్స్. ఈ లెక్కన క్రిస్మస్ సీజన్ ఈ ఇద్దరు హీరోలకు ఎలా కలిసొస్తుందనేది చూడాలి మరి.
డబ్బు చాలా చెడ్డది.. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావే అంటే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది. అన్నట్టే చేసింది.. దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ముళ్లు. ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు.. అంటూ సాగుతున్న రాబిన్ హుడ్ గ్లింప్స్ సినిమాపై హైప్ పెంచేస్తుంది.
1990 కాలంనాటి భావోద్వేగ ప్రయాణంగా రాబోతున్న బచ్చలమల్లి సినిమాలో ఉద్వేగవంతమైన పాత్రలో కనిపించనున్నాడు అల్లరినరేశ్. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మాతలు.
Thug Life | కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’ టీజర్ రిలీజ్