టాలీవుడ్ (Tollywood) టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) సుదీర్ఘ విరామం తర్వాత చేస్తున్న చిత్రం రంగమార్తాండ (Rangamarthanda). రంగమార్తాండ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగం కాబోతున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు చిరు. మెగాస్టార్ ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్తదేమీ కాదు. అయితే ఈ సారి మాత్రం చిరు (Chiranjeevi ) ఆడియెన్స్ కు కొత్త ఫీలింగ్ ఇవ్వబోతున్నాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్.
చిరు ఈ చిత్రానికి వాయిస్ అందిస్తున్నపుడు తెలుగు షాయరీలు (కవిత్వం) పఠించనున్నాడట. రెగ్యులర్ వాయిస్ ఓవర్ కంటే కొత్తగా..మరింత ప్రభావవంతంగా ఉండేలా, కథలోని భావోద్వేగపూరితమైన లోతులను సృశించేలా చిరు వాయిస్ ఓవర్ ఉండబోతుందని ఫిలినగర్ సర్కిల్ టాక్. కృష్ణవంశీ తాను చేయబోయే ఈ కొత్త ప్రయోగం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించడం ఖాయమని ధీమాగా ఉన్నాడట.
ఈ చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇతర నటీనటులు కీ రోల్స్ పోషిస్తున్నారు.
Read Also : Jr NTR | ఎన్టీఆర్ ఫిజికల్ ట్రైనింగ్ షురూ.. దేనికోసమంటే..?
Read Also : Genelia D’Souza | జెనీలియా గ్రాండ్ రీఎంట్రీ..క్రేజీ సినిమా వివరాలివే..!