బాలీవుడ్ లో అలౌకిక్ దేశాయ్ డైరెక్షన్ లో సీత సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ కథనందిస్తున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ ను లీడ్ రోల్ కోసం తీసుకుంటున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే గతంలో ఒక సినిమాకు సుమారు 6 నుంచి 8 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న కరీనాకపూర్..ఈ ప్రాజెక్టుకు మాత్రం భారీ మొత్తంలో అంటే సుమారు 12 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని న్యూస్ తెరపైకి వచ్చింది. సీత పాత్ర కోసం సుమారు 10 నెలల పాటు సమయం కేటాయించాల్సి ఉండటంతో కరీనా ఇంత పెద్ద మొత్తంలో పారితోషికం డిమాండ్ చేసిందని బీటౌన్ వర్గాల టాక్.
అయితే సీత పాత్ర కోసం కరీనా అంత పారితోషికం డిమాండ్ చేయడంపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో #BoycottKareenaKhan హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్ చేస్తున్నారు. హిందువుల మనోభావాలు కరీనా దెబ్బతీసిందని, సీత రోల్ కు కరీనా కంటే కంగనరనౌత్ బెటర్ ఆప్షన్ అని కొందరు కామెంట్లు పెడుతుండగా..కరీనాకపూర్ శూర్పణక క్యారెక్టర్ కు సరిపోతుందని సెటైరికల్ కామెంట్లు పెడుతున్నారు. మరి పక్కా ప్రొఫెషనల్ గా ఉండే కరీనాకపూర్ నెటిజన్ల రియాక్షన్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Kareena Khan can be replaced as Shurpanakha.
— ArupKabbo (@KabboArup) June 12, 2021
RT if you agree.#BoycottKareenaKhan pic.twitter.com/7Xow04Rgaj
#BoycottKareenaKhan in Sita role because #KanganaRanaut is fit for this #KANGANA_AS_SITA is best!🙏 pic.twitter.com/YAM1cEpZpW
— Saru Maini (@Saru_Maini) June 12, 2021
ఇవి కూడా చదవండి..
లోల్ సలామ్ ఫన్ ట్రైలర్ లాంఛ్ చేసిన నాని
గోపీచంద్ స్టైలిష్ ‘పక్కా కమర్షియల్’ లుక్ అదిరింది
పవన్ కల్యాణ్ కోసం శ్రీకాంత్ అడ్డాల స్టోరీ..?
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’..ఈ సారి చైనాపై దండయాత్ర..!
మహేష్ బాబు ఓల్డ్ ఫ్యామిలీ ఫోటో వైరల్
పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్ డేట్..!
షూటింగ్ కు టైం ఫిక్స్ చేయమన్న చిరంజీవి..!
Recommended Content by ntnews.com