Sundeep Kishan | తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ సందీప్ కిషన్ (Sundeep Kishan). ఈ టాలెంటెడ్ ఇటీవలే ధనుష్ టైటిల్ రోల్లో నటించిన రాయన్‌లో వన్ ఆఫ్ ది లీడ్ రోల్లో నటించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కాగా సందీప్ కిషన్ చేసిన పని నెటిజన్ల ఇంప్రెస్ కొట్టేస్తోంది. దీనిక్కారణం ఏంటో తెలుసా..? సందీప్ కిషన్కున్న మానవతా దృక్పథం.
భారీ వర్షాలకు విజయవాడ జల దిగ్బంధం అయిన విషయం తెలిసిందే. వరదలతో నిరాశ్రయులైన బాధితుల కోసం సందీప్ కిషన్ టీం తమ వంతుగా మద్దతుగా నిలిచింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి ఆహారం, తాగునీటితోపాటు ఇతర సామాగ్రిని అందజేసింది. సందీప్ కిషన్ చూపిస్తున్న ఔదార్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గతంలో సందీప్ కిషన్ ముంబైలో బిచ్చగాళ్లతో సరదాగా సాదాసీదాగా కాసేపు ముచ్చటించి.. వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగిన విజువల్స్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి. సందీప్‌కిషన్‌ను దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లాగే డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటూ ప్రశంసిస్తున్నారు.
#SundeepKishan – A Man With Golden Heart ❤️
Team @sundeepkishan Food Distribution to flood affected people in Vijayawada 👌
pic.twitter.com/HcBEXbF0X3— தனிக்காட்டு ராஜா™ (@itz__Sugu) September 4, 2024
Telugu Film Chamber | వరద బాధితుల కోసం తెలుగు ఫిలిం ఛాంబర్ భారీ విరాళం.. వివరాలివే
Thandel | జోష్ టు తండేల్.. నాగచైతన్య జర్నీకి ఎన్నేండ్లో తెలుసా..?
Samantha | మూవీ షూటింగ్లో గాయపడ్డ సమంత..! గాయాలు కాకుండా యాక్షన్ స్టార్‌ను కాగలనా? అంటూ పోస్ట్..!