టాలీవుడ్ న్యాచురల్ స్టార్ హీరో నాని (nani) ప్రస్తుతం దసరా (Dasara) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో సింగరేణి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతుంది. స్టార్ హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh) ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయిందంటూ కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి.
దసరా షూటింగ్ ఆగిపోయింది అని ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్‌కు డైరెక్టర్ శ్రీకాంత్ స్పందిస్తూ..బ్రహ్మీ జిఫ్ ఫైల్‌తో రిప్లై ఇచ్చి పుల్ స్టాప్ పెట్టాడు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్, సత్యన్ సూర్యన్ మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని తొలిసారి పక్కా తెలంగాణ పాత్రలో మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు.
ఇప్పటివరకున్న అప్డేట్ ప్రకారం 30 శాతం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. ఇటీవలే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన అంటే సుందరానికి చిత్రంతో ప్రేక్షకులను పలుకరించాడు నాని. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది.
https://t.co/oc0uFhyp2k pic.twitter.com/X9H3aJNHfD
— srikanth odela (@odela_srikanth) June 29, 2022