వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి పేదల ఇండ్లను కూల్చేందుకు సిద్ధమైంది. హైడ్రా తరహాలో వరంగల్‌లో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్నది. భద్రకాళి ఆలయ సమీపంలోని చెరబండ రాజు కాలనీలో అధికారుల సమక్షంలో పేదల ఇల్లు కూల్చివేస్తున్నారు.
అడ్డుకున్న వాళ్లని పోలీసు బందోబస్తు మధ్యన అడ్డుకుంటున్నారు. పోలీసుల దౌర్జన్యంపై కాలనీ వాసులు తిరగబడ్డారు. మహిళలు సీఐ కరుణాకర్‌తో వాగ్వాదానికి దిగారు. సీఐ ఓవరాక్షన్ పై కన్నీరు మున్నీరవుతున్నారు. ఆందోళనకారులను పోలీసులు మట్టెవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.