Haiku Telugu Trailer | తమిళ దర్శకుడు యువరాజ్ చిన్నసామి దర్శకత్వంలో తెరకెక్కిన క్యూట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘హైకూ’ (Haiku). ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. మహిళా కాలేజీలో అనుకోకుండా మన హీరో జాయిన్ అవుతాడు. మరి అతడు జాయిన్ అయ్యాక ఏం జరిగింది. కాలేజీలో హీరో పడే పాట్లు, ఆ తర్వాత అనుకోని పరిస్థితులలో ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ట్రయాంగిల్ లవ్ ట్రాక్ ట్రైలర్లో ఎంతో ఆసక్తికరంగా చూపించారు.
‘కోర్ట్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి అప్పల ఈ చిత్రంలోనూ లీడ్ రోల్లో నటించగా, హీరో ఏగన్ మరియు ఫెమినా జార్జ్ జోడీ స్క్రీన్‌పై చాలా ఫ్రెష్‌గా కనిపించారు. సిద్ధు కుమార్ అందించిన సంగీతం, ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను చాలా కలర్ఫుల్గా, రిచ్‌గా ప్రెజెంట్ చేశాయి. విజన్ సినిమా హౌస్ బ్యానర్‌పై డా. డి. అరులానందు, మాథెవో అరులానందు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 23, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.