KiaraSidharth | బాలీవుడ్ ప్రముఖ జోడీ కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. తాము రెండో బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ఈ జంట సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 7న వారు పంచుకున్న ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో 2025లో వీరికి మొదటి సంతానంగా కూతురు ‘సారాయ్’ జన్మించిన విషయం తెలిసిందే.
తమ జీవితంలోకి మరో చిన్నారి రాబోతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ దంపతులు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మరోసారి దేవుడు మాకు అత్యంత గొప్ప బహుమతిని ప్రసాదించాడు. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతలతో నిండిపోయాయి అని రాసుకొచ్చారు. ఈ గుడ్ న్యూస్ తెలిసిన వెంటనే సినీ పరిశ్రమలోని ప్రముఖులు, స్నేహితులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. తమ మొదటి ప్రెగ్నెన్సీ సమయంలో ఒక జత చిన్న తెల్లటి బేబీ సాక్స్‌ను పట్టుకుని ఫోటో షేర్ చేసిన ఈ జంట, ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ ప్రకటనలో కూడా అవే సాక్స్‌లను ఉపయోగించారు. ఈ కొత్త పోస్ట్‌లో వారి కూతురి చిన్నారి చెయ్యి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.