ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంకు ఇవాళ రెపో రేటు(Repo Rate)ను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. సుమారు మూడున్నర ఏండ్ల తర్వాత రెపో రేటను పెంచారు. ప్రస్తుతం రెపో రేటు 5.5 శాతానికి చేరుకున్నది. ద్రవ్యోల్బణం, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రెపో రేటును పెంచాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. రేట్ పెంచడం వల్ల ఇంటి రుణాలు, వాహన రుణాలు, కార్పొరేట్ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. ప్రస్తుతం ఈఎంఐ కడుతున్న వారిపై మరింత భారం పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో అవలంబించిన విధానాలకు విరుద్ధంగా ఆర్బీఐ తాజాగా రెపో రేటును పెంచింది. చివరిసారి 2023 ఫిబ్రవరిలో రెపో రేటును పెంచారు. అప్పుడు 0.25 శాతం పెంచి, 6.50 శాతానికి చేర్చారు. 2023-24 సీజన్లో రెపో రేటు మారలేదు. ఇక 2025 సైకిల్లో మాత్రం రేట్‌ను తగ్గించారు. ద్రవ్యపరపతి విధాన కమిటీ భేటీలో రెపో రేటను 25 బేసిస్ పాయింట్లు పెంచాలని ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం 4.82 శౄతం పెరిగినట్లు ఆర్బీఐ అంచనా వేసింది.