బాలీవుడ్ (Bollywood) యాక్టర్ షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఎన్సీబీ అధికారులు అనన్యపాండే (Ananya Panday)కు సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అనన్యపాండే ఇవాళ మధ్యాహ్నం ఎన్సీబీ (Narcotics Control Bureau) విచారణకు హాజరవగా..విచారణ ముగిసింది. సుమారు 2 గంటలపాటు ఎన్సీబీ అధికారులు ఆమెను విచారించారు. ఆర్యన్‌ఖాన్ తో డ్రగ్స్ చాటింగ్ విషయంలో అనన్యపై ఎన్సీబీ ప్రశ్నల వర్షం కురిపించినట్టు సమాచారం. కాగా ఈ వ్యవహారంలో ఎన్సీబీ రేపు మరోసారి అనన్యపాండేను విచారించనుంది.
ఇవాళ ఉదయం ఎన్సీబీ అధికారులు షారుక్‌ఖాన్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతూ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆర్యన్‌ఖాన్ విషయంలో సీరియస్‌గా ఉన్న ఎన్సీబీ అనన్యపాండేకు సమన్లు అందిచండంతో చాటింగ్‌లో ఇంకెవరి పేర్లు అయినా బయటకు వస్తాయోమోనని తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మొత్తానికి ఆర్యన్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
#WATCH | Mumbai: Actor Ananya Panday, her father Chunky Panday reach NCB office.
— ANI (@ANI) October 21, 2021
Ananya has been summoned by NCB for questioning. pic.twitter.com/SKiPf2S3P7
క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్‌ఖాన్ దగ్గర మత్తుపదార్థాలు ఏం లేవని ఇప్పటికే అతని తరపు న్యాయవాదులు కోర్టుకు నివేదించారు. అయితే ఆర్యన్ ఫోన్ సీజ్ చేసిన అధికారులు డ్రగ్స్‌కు సంబంధించి ఛాటింగ్ చేసినట్టుగా గుర్తించి..ఆ దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. ఆర్యన్ ఖాన్ పలు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా తిరస్కరణకు గురైంది. దీంతో బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆర్యన్ లాయర్లు. ఈ అంశం అక్టోబర్ 26న విచారణకు రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత