Annapoorani | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) లీడ్ రోల్లో నటించిన ప్రాజెక్ట్ ‘అన్నపూరణి’ (Annapoorani). డెబ్యూ డైరెక్టర్ నీలేష్ కృష్ణ (Nilesh Krishna) దర్శకత్వంలో నయనతార 75వ సినిమాగా తెరకెక్కింది. సనాతన బ్రాహ్మణ అమ్మాయి అన్నపూరణి తన ఇంటి నుండి బయటకు వెళ్లి దేశంలోనే అతిపెద్ద, ఉత్తమ చెఫ్ కావాలని బలంగా కోరుకుంటుంది. అన్నపూరణి తన కలలను సాధించడానికి ఎలా ముందుకు వస్తుందనే నేపథ్యంలో సినిమా సాగుతుంది.
హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని విశ్వహిందూ పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే 6 నెలల తర్వాత ఓటీటీలోకీ రీఎంట్రీ ఇచ్చింది అన్నపూరణి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు (భారత్ మినహా) ఈ తమిళ చిత్రాన్ని ఆగస్టు 9 నుంచి (Simply South)లో వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. సింప్లీ సౌత్ అధికారికంగా ప్రకటించినప్పటికీ మరి భారత్‌లోనే ఇతర ప్లాట్‌ఫాంలలో ఎక్కడైనా అందుబాటులో ఉందా అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ఈ మూవీలో జై, సత్యరాజ్, అచ్యుత్ కుమార్, కెఎస్ రవికుమార్, సురేష్ చక్రవర్తి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించగా.. ఎస్ థమన్ సంగీతం అందించాడు.
The sensational Annapoorani is BACK! 😍
Streaming on Simply South from August 9 worldwide, excluding India. pic.twitter.com/7KTYDrPRZ3
— Simply South (@SimplySouthApp) August 7, 2024
Mr Bachchan | రవితేజ స్టైలిష్ వార్నింగ్.. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ న్యూ లుక్
Rishab Shetty | 24 ఏండ్ల నిరీక్షణ.. కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెలవేరిన వేళ..!
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!