కొంతకాలంగా హాట్ టాపిక్‌గా ఉన్న వార్తల్లో ఒకటి కోలీవుడ్ (Kollywood) స్టార్ సెలబ్రిటీ నయనతార (Nayantara)-విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) వెడ్డింగ్. వీరికి సంబంధించిన ఆసక్తికర వార్త వెడ్డింగ్ (wedding) . విఘ్నేశ్-నయన్ వచ్చే నెలలో పెళ్లి పీటలెక్కబోతున్నారని ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చింది. తాజాగా మరో క్రేజీ అప్ డేట్ వీడియో రూపంలో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఇద్దరు జూన్ 9న కొద్ది మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వెడ్డింగ్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని తాజా వీడియోతో తెలిసిపోతుంది.
పెళ్లి వేడుక కోసం డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డును డిజైన్ చేసినట్టు ఓ వీడియో ఆన్ లైన్లో వైరల్ గా మారుతోంది. నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ సెర్మనీ తిరుమల టెంపుల్లో సింపుల్‌గా జరుపుకునేందుకు ప్లాన్ చేసుకున్నారని వార్తలు రాగా..తాజా వీడియోలో మాత్రం తమిళనాడులోని మహాబలిపురం అని తెలుస్తోంది. మరి ఈ డిజిటల్ వీడియో ఇన్విటేషన్ మరి ఈ డిజిటల్ వీడియో ఇన్విటేషన్ అఫీషియలేనా..? కాదా..? అనే దానిపై నయన్-విఘ్నేశ్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది నయనతార . తెలుగులో చిరంజీవితో కలిసి గాడ్‌ఫాదర్‌లో కీ రోల్ చేస్తోంది. మరోవైపు తమిళ స్టార్ డైరెక్టర్ ఆట్లీ, బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.