Navdeep | జై సినిమాతో ప్రేక్షకులకు హాయ్ చెప్పాడు హైదరాబాదీ యాక్టర్ నవదీప్. ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించాడు. చివరగా గతేడాది లవ్ మౌళి సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. లవ్ మౌళి ఫెయిల్యూర్‌గా నిలిచిపోవడం భావోద్వేగపూరితంగా తనను చాలా ప్రభావితం చేసిందని.. తనను షాక్ గురి చేసిందన్నాడు. ఆ అనుభవం చాలా బాధాకరమైనదని చెప్పాడు నవదీప్.
నవదీప్ లవ్ మౌళి ఫెయిల్యూర్ అనుభవాన్ని చాలా బాధాకరమైనదిగా అభివర్ణించాడు. అంతేకాదు లవ్ మౌళి సినిమా విడుదలైన తర్వాత ఎదురైన నిరాశను తట్టుకునేందుకు తాను చాలా ఇబ్బంది పడ్డానన్నాడు నవదీప్. తనను తాను నెగెటివిటీ నుంచి దూరంగా ఉండటానికి ఒకానొక టైంలో తాను ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని.. ఆ తర్వాత పెర్త్‌లోని తన సోదరి ఇంట్లో సుమారు 3 నెలలున్నట్టు చెప్పాడు.
ఈ టైంలో తాను ఇక సినిమాలకు స్వస్తి చెప్పాలని కూడా అనుకున్నాడన్నాడు నవదీప్. అయితే టైం, ఆత్మ పరిశీలన నవదీప్‌కు ఓ స్పష్టత వచ్చేలా చేశాయి. కట్ చేస్తే నవదీప్ మళ్లీ ఇప్పుడు దండోరా సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు నవదీప్.
Aadarsha Kutumbam | వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్లో మార్పు?
Bigg Boss 9 | టైటిల్ రేస్‌లో ట్విస్ట్.. విన్నర్ ఎవరు? అందరిలో పెరిగిన ఉత్కంఠ
Spirit | ప్రభాస్‌కి న్యూ ఇయర్ బ్రేక్ రద్దు.. టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన సందీప్ వంగా..!