Navdeep 2.o | ఎవరబ్బా ఈయన.. ఆ మధ్య ఓ పంజాబీ బాబా హీరో అయ్యాడు.. ఆయనలా ఉన్నాడు.. కొంపదీసి ఆయన కాదు కదా అనుకుంటున్నారా..? ఒకసారి తీక్షణంగా చూస్తే ఈయన ఎవరో అర్థం చేసుకోవచ్చు. అప్పుడెప్పుడో పదహారేళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చిన నవదీప్ ఇప్పుడు మరింత కొత్తగా మారిపోయాడు. తాజాగా కొత్త సినిమాలో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. నైరా క్రియేషన్స్ బ్యానర్‌పై అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా లవ్ మౌళి. ఈ చిత్రంలో నవదీప్, ఫంకూరీ గిద్వానీ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పూర్తిగా కొత్తగా మారిపోయాడు నవదీప్. ఈ సినిమాతో నవదీప్ 2.0 గా కనిపించనున్నారు.
MOULI NENE RA MOWA
— Navdeep (@pnavdeep26) January 26, 2022
Watch title reveal here ICYMI: https://t.co/cdbvOJiLnD
Co-starring @PankhuriGidwan1
Directed by @Love_Avaneendra
A #GovindVasantha musical
Produced by #NyraCreations Incubated & Executed by #CSpace@cspace.g pic.twitter.com/6ZF6j8noSp
జనవరి 26న ఆయన పుట్టిన రోజు సందర్భంగా లవ్ మౌళి సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా అవనీంద్ర చూసుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యాడు నవదీప్. బోల్డ్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. జై సినిమాతో హీరోగా మారిన నవదీప్ చందమామ, గౌతమ్ ఎస్సెస్సీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు నవదీప్. ఇలాంటి సమయంలో మళ్లీ హీరోగా మారిపోతున్నాడు. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ హీరోగా నటిస్తే ప్రేక్షకులు చూస్తారా లేదా అనేది చూడాలి..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
mahaan |తండ్రీకొడుకులు నటించిన తొలి సినిమా OTTలోకి .. నిరాశలో ఫ్యాన్స్
Pragya Jaiswal | అఖండ బ్యూటీకి బాలీవుడ్లో బంపర్ ఆఫర్..
OTT | 100 రోజులు దాటినా పెళ్లి సందD ఇంకా ఓటీటీలో ఎందుకు రాలేదు..?