OTT | 100 రోజులు దాటినా పెళ్లి సందD ఇంకా ఓటీటీలో ఎందుకు రాలేదు..?

Pelli SandaD movie in OTT | కరోనా కారణంగా కొన్ని సినిమాలను థియేటర్స్ కాకుండా నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోనే విడుదల చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఒకవేళ థియేటర్స్‌లో విడుదల అయినా కూడా 30 రోజుల్లోనే ఒరిజినల్ ప్రింట్ విడుదల చేస్తున్నారు. ఈ రోజుల్లో ప్రతి సినిమాకు మంచి రేటు ఇచ్చి ఓటీటీ సంస్థలు ఆయా సినిమాలను సొంతం చేసుకుంటున్నాయి. వీలైనంత త్వరగా వాటిని ప్రీమియర్ చేస్తున్నాయి. ఎంత పెద్ద సినిమా అయినా కూడా 50 రోజుల తర్వాత కచ్చితంగా ఒరిజినల్ ప్రింట్ విడుదల కావాల్సిందే. గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన రవితేజ క్రాక్, అల్లు అర్జున్ పుష్ప, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లాంటి సినిమాలు విడుదలైన నాలుగు వారాలలోపే ఓటీటీలోకి వచ్చేశాయి.మరోవైపు ఆఖండ, ఉప్పెన అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా 50 రోజుల తర్వాత ఒరిజినల్ ప్రింట్ విడుదలయ్యాయి. కానీ ఈ మధ్యకాలంలో రిలీజైన ఒక్క సినిమా మాత్రం ఇప్పటి వరకు ఇంకా రాలేదు. అదే పెళ్లి సందD.
శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోణంకి తెరకెక్కించిన పెళ్లి సందD సినిమా మంచి విజయం సాధించింది. నెగెటివ్ టాక్ వచ్చినా కూడా దసరా పండగ సీజన్‌ను బాగా క్యాష్ చేసుకోవడమే కాకుండా.. డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు కూడా తీసుకొచ్చింది పెళ్లి సందD. ముఖ్యంగా పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమాకు పోటీగా విడుదలైన శర్వానంద్ మహా సముద్రం డిజాస్టర్ కావడం పెళ్లి సందD సినిమాకు బాగా కలిసి వచ్చింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాగానే ఆడినా దాంతో పాటు రోషన్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది.
అక్టోబర్ 15న విడుదల అయిన పెళ్లి సందD సినిమా ఒరిజినల్ ప్రింట్ ఇంకా రాలేదు. ఏ ఓటీటీ సంస్థ కూడా ఇప్పటి వరకు పెళ్లి సందD డిజిటల్ రైట్స్ తీసుకోకపోవడం గమనార్హం. దానికి కారణం నిర్మాతలు చెబుతున్న భారీ రేటు అని తెలుస్తోంది. కొత్త హీరో సినిమాకు వర్కవుట్ కాదు అంత పెద్ద రేటు చెప్పడంతో ఏ ఓటీటీ సంస్థ కూడా పెళ్లి సందD వైపు అడుగులు వేయడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా ఇంకా ఎవరు తీసుకోలేదు. మరి 100 రోజుల తర్వాత కూడా ఇంకా ఒరిజినల్ ప్రింట్ విడుదల చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారో చూడాలి మరి. అయినా కొత్త హీరో సినిమా విషయంలో నిర్మాతలు ఇంత పట్టుదలతో ఉండటం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
sree leela: పెళ్లి సందడి బ్యూటీ వెనక పడుతున్న టాలీవుడ్ హీరోలు
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Sree Leela Break| సినిమాలకు పెళ్లి సందD హీరోయిన్ బ్రేక్ ..కారణమేంటో తెలుసా..?
కలిసిపోయిన యాంకర్ రవి, శ్రీముఖి.. విభేదాలు తొలగిపోయినట్లేనా..?
Akhanda Remake | అఖండ రీమేక్ కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

