కలిసిపోయిన యాంకర్ రవి, శ్రీముఖి.. విభేదాలు తొలగిపోయినట్లేనా..?

Anchor Ravi and Sreemukhi | యాంకరింగ్‌లో బుల్లితెరపై ఎవర్ గ్రీన్ కపుల్ రవి, శ్రీముఖి. ఒకప్పుడు లాస్యతో అద్భుతమైన కెమిస్ట్రీ పండించిన ఈ యాంకర్.. ఆ తర్వాత శ్రీముఖితో కూడా మ్యాజిక్ చేశాడు. ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులకు పండగ. అలాగే ఇద్దరూ కలిసి చేసిన ప్రోగ్రామ్స్ కు టీఆర్పీ రేటింగ్స్ కూడా అదిరిపోయాయి. కానీ గత మూడేళ్లుగా ఇద్దరూ విడివిడిగా షోస్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్న యాంకర్ రవి, శ్రీముఖి.. ఒక చిన్న కారణంతో విడిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అప్పటి వరకు ఇద్దరూ కలిసి చేసిన పటాస్ షో అద్భుతమైన హిట్టయింది. అందులో నుంచి శ్రీముఖి బయటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు రవి కూడా వదిలేశాడు. దాంతో మరో ఆప్షన్ లేక షో ఆపేశారు నిర్వాహకులు.
పటాస్ మాత్రమే కాదు రవి, శ్రీముఖి కలిసి చేసిన ప్రోగ్రామ్స్ చాలా వరకు హిట్ అయ్యాయి. ఇద్దరూ విడిపోయిన తర్వాత వాటికి సరైన జోడీ దొరక్క ప్రోగ్రామ్స్ ఆపేశారు ఆయా షో నిర్వాహకులు. అలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఇద్దరు.. మళ్లీ ఇప్పుడు కలిసి పని చేస్తున్నారు. ఈ మధ్య బిగ్ బాస్ 5 లో పాల్గొన్న యాంకర్ రవి బయటికి వచ్చిన తర్వాత బాగా బిజీ అయిపోయాడు. కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా ఉంటాడు అని అందరూ అంచనా వేసినా కూడా.. 80 రోజుల తర్వాత ఆయన ఎలిమినేట్ అయ్యాడు. వచ్చిన తర్వాత వరుసగా షోస్ కు యాంకరింగ్ చేస్తూ బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ మహోత్సవం అనే ప్రోగ్రాంకి శ్రీముఖితో కలిసి యాంకరింగ్ చేశాడు రవి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన తర్వాత షో మేకర్స్ కూడా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటి నుంచి మళ్లీ రవి శ్రీముఖి కలిసి పని చేస్తారు అని కాన్సెప్ట్ సిద్ధం చేసుకుంటున్నారు. అంతకుముందు కొన్నేండ్ల పాటు దూరంగా ఉన్న లాస్యను కూడా కలుపుకొని పోయాడు రవి. మొత్తానికి తనతో విభేదాలున్న యాంకర్స్ అందరితో కలిసి పోతున్నాడు ఈయన.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Sreemukhi | బ్లూ డ్రెస్‌లో అందాల శ్రీముఖి స్టన్నింగ్ ఫొటోస్..
Sreemukhi: శ్రీముఖికి నాలుగు పేజీల లేఖ రాసిన అభిమాని.. చదివి ఉబ్బితబ్బిబైన యాంకరమ్మ
ఇండస్ట్రీకి ఎందుకు వచ్చానా అని కన్నీరు పెట్టుకున్న శ్రీముఖి..!
క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ హాట్ యాంకర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

