Akhanda Remake | అఖండ రీమేక్ కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరు బాలీవుడ్ స్టార్స్

Akhanda Remake | తెలుగు ఇండస్ట్రీని ఈ మధ్య కాలంలో షేక్ చేసిన సినిమా అఖండ. సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకుంది. అంచనాలకు మించి రాణించింది. పసిపాప, ప్రకృతి జోలికొస్తే ఆ పరమ శివుడు దిగివచ్చి బుద్ధి చెబుతాడు అనే అద్భుతమైన లైన్ తీసుకొని మాస్ ఆడియన్స్ ను మెప్పించే విధంగా అఖండ సినిమాను తెరకెక్కించాడు బోయపాటి శ్రీను. మొదట్లో రొటీన్ సినిమా అని అందరూ లైట్ తీసుకున్న కూడా ఆ తర్వాత ఇది సృష్టించిన కలెక్షన్ల ప్రభంజనం గురించి చెప్పుకోడానికి మాటలు సరిపోవు.
బాలకృష్ణ కెరీర్లో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత కలెక్షన్ల సునామీ సృష్టించింది అఖండ. ఈ సినిమాకు ముందు ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన కలెక్షన్స్ 47 కోట్లు మాత్రమే. అది కూడా ఏపీలో పన్ను మినహాయింపు ఇస్తే వచ్చాయి. అలాంటిది అఖండ మాత్రం ఏకంగా రూ.75 కోట్ల షేర్ వసూలు చేసింది. అందులోనూ కరోనా సమయంలో సినిమా వచ్చి అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పుడు ఈ సినిమా గురించి మిగిలిన ఇండస్ట్రీలు మాట్లాడుకుంటున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో అఖండ సినిమా రీమేక్ గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది. ముందు దీన్ని అక్కడ డబ్బింగ్ చేసి విడుదల చేయాలి అని ఆలోచన కూడా ఉండేది. బాలయ్యకి అంత ఇమేజ్ లేకపోవడంతో రీమేక్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా రైట్స్ కోసం బాలీవుడ్లో ఇద్దరు హీరోలు బాగా ప్రయత్నిస్తున్నారు. ఒకరు అక్షయ్ కుమార్.. మరొకరు అజయ్ దేవ్‌గణ్. ఇద్దరూ మాస్ యాక్షన్ హీరోలు. వీళ్లకు అయితే అఖండ సినిమా పర్ఫెక్ట్గా సరిపోతుందని అభిమానులు కూడా చెబుతున్న మాట. కచ్చితంగా ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బాలీవుడ్లో అఖండ సినిమా రీమేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న మాస్ కథ కావడంతో ఉత్తరాది ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తారని బలంగా నమ్ముతున్నారు నిర్మాతలు. త్వరలోనే అఖండ బాలీవుడ్ రీమేక్ పై స్పష్టత రానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Akhanda Making Video | యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాలయ్య ‘అఖండ’ మేకింగ్ వీడియో
పాన్ ఇండియన్ దండయాత్రకు సిద్ధమవుతున్న బాలకృష్ణ
Tollywood | ఆ విషయంలో బాలీవుడ్‌ను వెనక్కి నెట్టేసిన టాలీవుడ్..
Aacharya | ఆ విషయంలో చిరంజీవి, బాలకృష్ణను ఇప్పటి హీరోలు అందుకోగలరా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

