Akhanda Making Video | నందమూరి బాలకష్ణ నటించిన అఖండ సినిమా గత సంవత్సరం డిసెంబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి తెలుగు సినిమా రికార్డులనే బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో కూడా విడుదలై సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న అఖండ సినిమాను తాజాగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో కూడా రిలీజ్ చేశారు. తెలుగు ఆడియోతో.. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సినిమాను హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు.
థియేటర్లలో సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేసిందో.. హాట్‌స్టార్‌లో కూడా అదే రేంజ్లో రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే అఖండ సినిమాకు భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ సినిమా మేకింగ్ వీడియోను హాట్‌స్టార్ తన యూట్యూబ్ అకౌంట్లో షేర్ చేసింది. సినిమా మేకింగ్ వీడియోను సినిమా పూర్తయ్యాక కూడా చూడొచ్చు. దాన్ని సపరేట్ చేసి ఆ వీడియోను హాట్‌స్టార్ యూట్యూబ్‌లో షేర్ చేయడంతో ఆ వీడియో యూట్యూబ్‌లో రికార్డులను తిరగరాస్తోంది. హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన 5 గంటల్లోనే లక్షల్లో మేకింగ్ వీడియోకు వ్యూస్ వచ్చాయి. ఇంకెందుకు ఆలస్యం.. బాలయ్య బాబు అఖండ సినిమా మేకింగ్ వీడియో ఎలా ఉందో మీరే చూడండి.