Tollywood | ఇండియాలో నంబర్‌వన్ సినిమా ఇండస్ట్రీ ఏది.. దీనికి సమాధానం కొన్ని రోజుల క్రితం వరకు బాలీవుడ్ అని చెప్పేవాళ్లు. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు కూడా లేవు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బాలీవుడ్ వెనుకబడి పోయింది. అక్కడి హీరోలను, హిందీ సినిమాలను డామినేట్ చేసే ఇండస్ట్రీ మరొకటి వచ్చింది. అదేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మన తెలుగు ఇండస్ట్రీ. నిజానికి బాహుబలి సినిమా తర్వాత దేశంలోని అన్ని ఇండస్ట్రీలు టాలీవుడ్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి.
మన దగ్గర వచ్చే సినిమాల గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటారు. అయితే బాహుబలి తర్వాత మళ్లీ ఆ స్థాయి పాన్ ఇండియన్ సినిమా తెలుగులో రాలేదు. కానీ మన సినిమాల మార్కెట్ బాగా పెరిగిపోయింది. ఇక్కడ కూడా వందల కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చిన సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. 2021కి గాను బయటకు వచ్చిన లెక్కల ప్రకారం దేశంలో టాలీవుడ్ నంబర్‌వన్ సినిమా ఇండస్ట్రీగా నిలిచింది. గత ఏడాది మన దగ్గర ఏకంగా 1300 కోట్లు వసూలు చేశాయి మన సినిమాలు. దేశంలో మరే ఇండస్ట్రీ కూడా ఇన్ని వందల కోట్లు వసూలు చేయలేదు.
బాలీవుడ్ కూడా సగంలోనే ఆగిపోయింది. 2021లో తెలుగు ఇండస్ట్రీ దాదాపు 15 విజయాలు అందుకుంది. సంక్రాంతికి వచ్చిన క్రాక్ సినిమా నుంచి ఏడాది చివర్లో వచ్చిన పుష్ప, అఖండ, శ్యామ్ సింగరాయ్ వరకు ఇవన్నీ కలిపి దాదాపు 1300 కోట్లు వసూలు చేశాయి. అదే సమయంలో బాలీవుడ్లో వచ్చిన ఏ సినిమాలు కూడా ఈ స్థాయిలో వసూలు చేయలేదు. తద్వారా మొదటి సారి దేశంలో నంబర్‌వన్ సినిమా ఇండస్ట్రీగా టాలీవుడ్ సగర్వంగా నిలిచింది. ఈ రికార్డులు ఈ సంవత్సరం కూడా కొనసాగుతాయని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
RRR కారణంగా ఎన్టీఆర్ ఎంత నష్టపోయాడో తెలుసా..?
సంక్రాంతి బరిలో డబ్బింగ్ సినిమాలు.. అందరూ స్టార్ హీరోలే..
Pushpa in OTT | RRR డేట్‌ను బ్లాక్ చేసిన పుష్ప.. ఓటీటీలో వచ్చేది అప్పుడే
ట్రిపుల్ ఆర్ బాటలోనే రాధేశ్యామ్.. ఫిల్మ్ రిలీజ్ వాయిదా
షణ్ముఖ్ బాటలోనే సిరి కూడా.. బ్రేకప్ దిశగా అడుగులు..