e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News sree leela: పెళ్లి సంద‌డి బ్యూటీ వెన‌క ప‌డుతున్న టాలీవుడ్ హీరోలు

sree leela: పెళ్లి సంద‌డి బ్యూటీ వెన‌క ప‌డుతున్న టాలీవుడ్ హీరోలు

టాలీవుడ్‌లో క‌న్న‌డ భామ‌ల హంగామా న‌డుస్తుంది. తాజ‌గా పెళ్లి సంద‌డి చిత్రంతో ఆక‌ట్టుకున్న శ్రీలీల తొలి చిత్రంతోనే ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. న‌ట‌న‌, గ్లామర్, డ్యాన్స్‌తో కుర్ర హీరోలకు బెస్ట్ ఆప్ష‌న్‌గా మారింది. పెళ్లి సంద‌డి చిత్రంలో శ్రీల‌ల ప‌ర్‌ఫార్మెన్స్‌కి చాలా మంది ముగ్ధుల‌య్యారు.ఆమె యాక్టింగ్ కు అందానికి యూత్ అంతా కూడా ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ యంగ్ బ్యూటీ కి వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీలీల ఐదారు సినిమాలకు సంబంధించి చర్చలు జరుపుతోందట. శ‌ర్వా, నితిన్‌, నిఖిల్, సాయిధ‌ర‌మ్ తేజ్‌.. ఇలాంటి యంగ్ బ్యాచ్ ప‌క్క‌న శ్రీ‌లీల అయితే బాగుంటుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. కొత్త హీరోల‌కైతే త‌ను మంచి ఆప్షనే. అందుకే ఆమెవైపే నిర్మాత‌లు దృష్టి సారిస్తున్న‌ట్టు స‌మాచారం.

- Advertisement -

ఇటీవ‌ల శ్రీలీల ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు కూతురని సోషల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ కాగా, . ఇన్ని రోజులు దీనిపై మౌనంగా ఉన్న శుభాకరరావు ఇటీవల ఈ విషయంపై స్పందించారు. తన ఆస్తి కోసమే వారు ఇంటర్వ్యూలలో ఇలా ప్రచారం చేస్తు్న్నారని శుభాకరరావు ఆరోపించారు. శ్రీలీల అసలు తన కూతురే కాదని తేల్చి చెప్పారు. శ్రీలీల తన కూతురు కాదని, తన మాజీ భార్య కూతురని బయటపెట్టారు సూరపనేని శుభాకరరావు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement