Navdeep | టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో నవదీప్ ఒకడు. 2004లో తేజ దర్శకత్వంలో వచ్చిన జై సినిమాతో హీరోగా మారిన నవదీప్.. వరుస సినిమాల్లో నటించి లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హీరోగా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, వ్యాఖ్యాతగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. కరోనా టైంలో ఓటీటీలోనూ వెబ్ సిరీస్‌లు చేశాడు. 35 ఏండ్ల వయసు ఉన్న నవదీప్.. ఇప్పటికీ పెండ్లి మాట ఎత్తడం లేదు. టూర్లకు వెళ్లడం.. జిమ్‌లో వర్కవుట్స్ చేయడం.. ఫ్రెండ్స్‌తో లాంగ్ డ్రైవ్స్‌కు వెళ్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నవదీప్‌ను పెండ్లి చేసుకోమని పలువురు ఫ్యాన్స్ ఆయనకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. వీటితో చిర్రెత్తుకొచ్చిన నవదీప్.. పెండ్లి చేసుకోమని సలహాలిస్తున్న వారందరికీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
Oddhu ra sodhara 🙂 pic.twitter.com/IYKSAGFDVE
— Navdeep (@pnavdeep26) January 23, 2022
పెండ్లిపై ఉచిత సలహాలు ఇస్తున్న వారందరినీ ఉద్దేశించి ఒక వీడియోను ట్వీట్ చేశాడు నవదీప్. దానికి ఒద్దురా సోదరా అంటూ రాసుకొచ్చాడు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. “అన్నా నీ గడ్డం తెల్లబడుతోంది తొందరగా పెండ్లి చేసుకో అని నాకు కొంతమంది సలహాలిస్తున్నారు. గడ్డం తెల్లబడితే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్.. పెండ్లి కాదు. దురద పుడితే గోక్కుంటాం కానీ తోలు పీకేసుకోం కదా” అంటూ కౌంటరిచ్చాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Shraddha Kapoor | మేకప్ ఆర్టిస్ట్ పెండ్లికి పెద్దగా మారిన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్
Allu Arjun| వివాదంలో అల వైకుంఠపురంలో హిందీ వర్షన్.. చివర్లో మరో ట్విస్ట్..
దూసుకెళ్తున్న జీ5యాప్.. ఆ ఓటిటి సంస్థ చేతిలోనే RRR సహా 3 పాన్ ఇండియన్ సినిమాల రైట్స్
Samantha | పుష్ప తర్వాత సమంత మరోసారి ఐటెం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?