Hungry At Night | రాత్రి సమయంలో ఆకలి అవుతుందా.. ఇలా ఎందుకు జరుగుతుంది.. ఏం చేయాలి..?
రాత్రి సమయంలో ఆకలిగా అనిపించినప్పుడు చాలా మంది తమని తాము నిందించుకుంటారు. అది కేవలం నియంత్రణ లేకపోవడం లేదా అనారోగ్యకరమైన స్నాక్స్ తినే అలవాటు వల్లనే అని భావిస్తారు. అయితే రాత్రి తరచుగా ఆకలి వేయడం అనేది చాలా సందర్భాల్లో శరీరంలోని జీవసంబంధ ప్రక్రియలు (biological processes), హార్మోన్ల మార్పుల కారణంగా కూడా జరగవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
Hungry At Night | రాత్రి సమయంలో ఆకలిగా అనిపించినప్పుడు చాలా మంది తమని తాము నిందించుకుంటారు. అది కేవలం నియంత్రణ లేకపోవడం లేదా అనారోగ్యకరమైన స్నాక్స్ తినే అలవాటు వల్లనే అని భావిస్తారు. అయితే రాత్రి తరచుగా ఆకలి వేయడం అనేది చాలా సందర్భాల్లో శరీరంలోని జీవసంబంధ ప్రక్రియలు (biological processes), హార్మోన్ల మార్పుల కారణంగా కూడా జరగవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆకలి అవ్వడం అనేది శరీరంలోని అంతర్గత గడియారం (circadian clock), ఆకలి, తృప్తి, మెటాబాలిజాన్ని నియంత్రించే పలు హార్మోన్లపై ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నిద్ర సరిగా లేకపోవడం, ఒత్తిడి, మెటాబాలిక్ సమస్యలు లేదా హార్మోన్ మార్పులు వంటి కారణాల వల్ల ఈ వ్యవస్థలు ప్రభావితమైతే సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఆకలి ఎక్కువగా అనిపించవచ్చని వారు చెబుతున్నారు.
హార్మోన్ల ప్రభావం..
రాత్రి ఆలస్యంగా ఆకలి వేయడాన్ని చాలా మంది బలహీన సంకల్పంగా భావిస్తారు. కానీ చాలా సందర్భాల్లో అది శరీర జీవశాస్త్రంతో సంబంధం ఉంటుంది. ఆకలిని సర్కేడియన్ క్లాక్తో పాటు గ్రెలిన్, లెప్టిన్, ఇన్సులిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లు నియంత్రిస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. అలాగే ఏం తింటారనే విషయం ఎంత ముఖ్యమో, ఎప్పుడు తింటారనేది కూడా అంతే ముఖ్యమని, సాయంత్రం ఆలస్యంగా తినడం వల్ల ఆకలి పెరగడం, శరీరం క్యాలరీలను ఖర్చు చేసే సామర్థ్యం తగ్గడం జరుగుతుంది. దీని వల్ల బరువు పెరగడం, మెటాబాలిక్ వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అందువల్ల రాత్రి తరచుగా ఆకలి వేయడం అనేది కేవలం అలవాటు మాత్రమే కాకుండా నిద్ర సమస్యలు లేదా హార్మోన్ మార్పులు వంటి ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాత్రిపూట ఆలస్యంగా తింటే..
శరీరంలోని ఆకలి నియంత్రణ వ్యవస్థ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. గ్రెలిన్ ఆకలిని పెంచుతుంది. లెప్టిన్ తృప్తి సంకేతాన్ని ఇస్తుంది. GLP-1, పెప్టైడ్ YY వంటి జీర్ణాశయ హార్మోన్లు భోజనం తర్వాత తృప్తిని పెంచుతాయి. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. కార్టిసాల్ ఒత్తిడి, నిద్ర నమూనాలను ఆహార కోరికలతో కలిపి ప్రభావితం చేస్తుంది. ఈ హార్మోన్లన్నీ రోజువారీ జీవ గడియారం ప్రకారం పనిచేస్తాయని నిద్ర తగ్గిపోవడం లేదా ఆలస్యంగా నిద్రించడం వల్ల ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఆకలి సంకేతాలు ఎక్కువగా రావచ్చని వైద్యులు తెలియజేస్తున్నారు. అలాగే ఒకే రకమైన క్యాలరీలు తీసుకున్నప్పటికీ రోజులో ఆలస్యంగా తినేవారిలో ఆకలి ఎక్కువగా ఉండడం, శక్తి వినియోగం తగ్గిపోవడం జరుగుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్, బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, ఆలస్యంగా తినే వ్యక్తుల్లో ఆకలి ఎక్కువగా ఉంటుంది. క్యాలరీలు ఖర్చయ్యే వేగం తగ్గుతుంది. కొవ్వు నిల్వకు సంబంధించిన హార్మోన్ మార్పులు కూడా జరుగుతాయి. నిద్ర లేకపోవడం ఈ సమస్యను మరింత పెంచుతుంది. నిద్ర తక్కువగా ఉంటే గ్రెలిన్ పెరిగి, లెప్టిన్ తగ్గిపోతుంది. దీని వల్ల ఎక్కువగా ఆకలి వేస్తుంది. అధిక క్యాలరీల ఆహారం తినాలనే కోరిక పెరుగుతుంది.
ఎండోక్రైన్ లేదా మెటబాలిక్ వ్యాధులు ఉంటే..
ఇక వైద్యుల చెబుతున్న దాని ప్రకారం కొన్ని ఎండోక్రైన్, మెటాబాలిక్ వ్యాధులు కూడా రాత్రి ఆకలి పెరగడానికి కారణం కావచ్చు. స్థూలకాయం, PCOS, మెనోపాజ్ లేదా పెరిమెనోపాజ్, కుషింగ్స్ సిండ్రోమ్, స్లీప్ అప్నియా వంటి వ్యాధులు కూడా ఆకలి పెరగడానికి కారణం అవుతాయని వైద్యులు చెబుతున్నారు. వీటితో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్, నిద్ర విఘాతం లేదా కార్టిసాల్ మార్పులు వంటివి కూడా రాత్రి సమయంలో ఆకలిని పెంచుతాయి. అలాగే స్త్రీలల్లో మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల నిద్ర సమస్యలు, మూడ్ మార్పులు, శరీర కొవ్వు పంపిణీ మార్పులు జరుగుతాయి. ఇవి కూడా స్త్రీలలో ఆకలి పెరగడానికి కారణమవుతుంది. అలాగే స్లీప్ అప్నియా వంటి నిద్ర సమస్యలు కూడా ఆకలి నియంత్రణను ప్రభావితం చేస్తాయి. ఇవి కూడా బరువు పెరగడం, మెటాబాలిక్ సమస్యలకు దారితీయవచ్చు.
జీఎల్పీ-1 మందుల ప్రభావం..
అయితే కొత్తగా వచ్చిన GLP-1 హార్మోన్ను అనుకరించే బరువు తగ్గించే మందులు ఆకలిని తగ్గించడంలో సహాయపడుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ మందులు సాధారణంగా ఆకలిని తగ్గిస్తాయి. ఎప్పుడూ తినాలనే ఆలోచనని కూడా తగ్గిస్తాయి. అయితే కొన్ని పరిస్థితుల్లో రాత్రి ఆకలి కొనసాగవచ్చు. మందు మోతాదు ప్రారంభ దశలో ఉండటం, రోజులో తగినంత ప్రోటీన్ తీసుకోకపోవడం, వాంతుల భయం వల్ల భోజనం మానేయడం, నిద్ర సమస్యలు ఉండటం వల్ల ఆకలి అలాగే కొనసాగవచ్చు. GLP-1 రిసెప్టర్ అగోనిస్టులు మెదడులో తృప్తి కేంద్రాలను ఉత్తేజపరచి, జీర్ణశాయ-మెదడు సంకేతాలను మెరుగుపరచడం ద్వారా తక్కువ ఆహారం తినేలా చేస్తాయి. 2025 డిసెంబర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్థూలకాయ చికిత్సలో GLP-1 మందులపై మొదటి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మందులను కేవలం అందం కోసం కాకుండా దీర్ఘకాలిక వ్యాధి చికిత్సలో భాగంగా ఉపయోగించాలని సూచించింది.
వైద్యులను కలవాలి..
కొన్నిసార్లు రాత్రి ఆకలి సాధారణమే అయినప్పటికీ రాత్రి తక్కువ బ్లడ్ షుగర్ లక్షణాలు, చెమటలు ఎక్కువగా పట్టడం, భయంకరమైన కలలు, ఉదయం తలనొప్పి, గందరగోళం, గుండె వేగంగా కొట్టుకోవడం, రాత్రి సమయంలో బ్లడ్ షుగర్ 70 mg/dL కంటే తక్కువగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రాత్రి ఆకలి వేయడాన్ని చాలా మంది కేవలం అలవాటు లేదా నియంత్రణ లేకపోవడంగా భావిస్తారు. కానీ శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నదేమిటంటే హార్మోన్లు, నిద్ర, మెటాబాలిజం, శరీర జీవ గడియారం కలిసి ఈ సమస్యను ప్రభావితం చేస్తాయి. అప్పుడప్పుడు రాత్రి ఆకలి కావడం సహజం. అయితే ఇది తరచుగా జరుగుతూ ఇతర లక్షణాలతోపాటు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- eating
- foods
- health tips
- hunger
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

