నార్నూర్ : గిరిజన సంక్షేమ ఆశ్రమొన్నత విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో ( ITDA PO ) యువరాజ్ మార్మాట్( Yuvaraj Marmat ) ఉపాధ్యాయులకు ఆదేశించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం జామడ, మార్కాపుర్ దిశ మోడల్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై వార్డెన్, ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలిస్తూ, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత ( Result ) సాధించాలని సూచించారు. మెను పాటిస్తూ విద్యార్థులకు రుచికరమైన భోజనాన్ని వడ్డించాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన ఉండాలని, ఆటపాటలతో బోధన అందించాలన్నారు., అపరిశుభ్రతతో దోమలు వ్యాపించి విద్యార్థులు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయని, నిత్యం వసతి గృహ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు.