Allu Arjun| వివాదంలో అల వైకుంఠపురంలో హిందీ వర్షన్.. చివర్లో మరో ట్విస్ట్..

Allu Arjun’s Ala Vaikunthapurramuloo | సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో తెలుగులో కంటే హిందీలో పెద్ద విజయం అందుకొన్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా హిందీలో ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్.. 80 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. సినిమా హక్కులు కేవలం 10 కోట్లకు కొంటే.. థియేట్రికల్ కలెక్షన్స్ 45 కోట్లు వచ్చాయి. ఈ లెక్కన ఉత్తరాది ప్రేక్షకులను అల్లు అర్జున్ ఎంత అలరించాడో అర్థమవుతుంది. పుష్ప సినిమాతో వచ్చిన క్రేజ్ వాడుకోవాలని ఆయన నటించిన అల వైకుంఠపురంలో సినిమాను హిందీలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేశారు. దీని కోసం ఆగమేఘాల మీద ప్రమోషన్ కూడా చేపట్టారు.
జనవరి 26న సినిమాను విడుదల చేస్తామని అఫీషియల్ గా పోస్టర్ విడుదల చేశారు. అయితే ఈ సినిమాను షెహజాదా పేరుతో ఇప్పటికే హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా ఈ సినిమా అక్కడ రీమేక్ అవుతుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇలాంటి సమయంలో అల వైకుంఠపురంలో హిందీ వర్షన్ థియేటర్స్ లో విడుదల అయితే తమ సినిమాను ఎవరు చూస్తారు అంటూ రీమేక్ చేస్తున్న దర్శక నిర్మాతలు లైన్ లోకి వచ్చారు. ఈ విషయంపై తమకు న్యాయం చేయాలని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సాయం వాళ్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన చొరవతో గోల్డ్ మైన్స్ టెలి ఫిలిమ్స్ అధినేత మనీష్ షా అల వైకుంఠపురంలో హిందీ రిలీజ్ ఆపేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ఫిబ్రవరి 6న తన సొంత టీవీ చానెల్ దించక్ టీవీలో మాత్రం హిందీ వర్షన్ ప్రీమియర్ చేస్తున్నట్లు ఆయన అనౌన్స్ చేశారు. దీనిపై షేహజాద టీం ఎలా స్పందిస్తుందో చూడాలి. సినిమా ఒకసారి టీవీలో వచ్చిందంటే అది ఒకసారితో ఆగదు. వరుసగా దాన్ని టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు. ఇది కూడా అల వైకుంఠపురంలో హిందీ రీమేక్ పై ప్రభావం చూపించక మానదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Pushpa | వాయిస్ ఆర్టిస్ట్గా పనికిరావన్నారు.. ఇప్పుడు హిందీలో ‘తగ్గేదేలే’ అంటూ ఊపేస్తున్నాడు!
కొత్త మెగాస్టార్ అల్లు అర్జునే.. ఇది కఠిన సత్యం.. ఆర్టీవీ ట్వీట్
‘పుష్ప’లో అల్లు అర్జున్ తర్వాత ఆ రేంజ్లో కనిపించిన జగదీశ్ ప్రతాప్ బండారి …
అప్పుడే రెండేళ్లు పూర్తి చేసుకున్న అల వైకుంఠపురములో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

