Shraddha Kapoor | మేకప్ ఆర్టిస్ట్ పెండ్లికి పెద్దగా మారిన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్

Shraddha Kapoor | బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురిగా సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ సొంతంగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది శ్రద్ధా కపూర్. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు ఈమె చేసిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన మేకప్ ఆర్టిస్ట్ పెండ్లికి పెద్దగా మారి పెండ్లినాటి ప్రమాణాలను చదివించి నవ్వులు పూయించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
గత కొంతకాలంగా శ్రద్ధా నాయక్ అనే అమ్మాయి.. శ్రద్ధా కపూర్‌కు వ్యక్తిగత మేకప్ అసిస్టెంట్‌గా పనిచేస్తుంది. దీంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఇదిలా ఉంటే శ్రద్ధా నాయక్ పెండ్లి ఇటీవల జరిగింది. తన ప్రియుడు రిచీని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ పెండ్లికి శ్రద్ధాకపూర్ పెద్దగా మారారు. వధూవరులతో పెండ్లినాటి ప్రమాణాలు చదివించే బాధ్యతను తీసుకుంది. ముందుగా ఈ పెండ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా? అని వధూవరులను శ్రద్ధాకపూర్ ప్రశ్నించింది. దీనికి వారు అంగీకారమే అని చెప్పడంతో ఇక మీరు వధువను ముద్దాడవచ్చు అని ఫన్నీగా చెబుతూ పెండ్లిలో నవ్వులు పూయించింది. దీనికి సంబంధించిన వీడియోను శ్రద్ధా నాయక్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఒక స్టార్ హీరోయిన్ అయ్యుండి తన పెండ్లి పెద్దగా మారిన శ్రద్ధా కపూర్ మంచి మనసును పొగుడుతూ కృతజ్ఞతలు తెలిపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Samantha | పుష్ప తర్వాత సమంత మరోసారి ఐటెం సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
Shraddha Kapoor : సాహో బ్యూటీ త్వరలో పెళ్లి పీటలెక్కనుందా…!
Shraddha Kapoor| శ్రద్దాకపూర్ వెడ్డింగ్‌పై శక్తికపూర్ ఏమన్నాడంటే..?
Prabahs : సాహో బ్యూటీతో మరోసారి సందడి చేయనున్న ప్రభాస్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- bollywood
- shraddha kapoor
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

